Vaikunta Dwaram (Telugu) | వైకుంఠ ద్వారం

Vaikunta Dwaram (Telugu) explains the significance of Vaikunta Dwara Darshanam on Vaikunta Ekadashi…

వైకుంఠ ద్వారం

శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వార ప్రవేశం; తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.

తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలకేంద్రంలో ఉన్న శ్రీరంగనాయక స్వామీ వారి క్షేత్రం విశిష్టతను కలిగి ఉన్నది. యిక్కడ స్వామివారు శేషతల్పముపైన శేయనించి నాభిమద్యమున బ్రహ్మ ని కలిగి అనంత దేవతాముర్తులతో కనిపించును.. యిక్కడ ఉండు విగ్రహం మరేచోట దర్శనం యివ్వదు.. యిక్కడ వైకుంట ఏకాదశి 3 రొజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం ఉత్తర ద్వారాన్ని కలిగిఉన్నది. మరియు కార్తికమాస శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి..

మంచి కోసం మన పూర్వికులు అనేక సంప్రదాయాలు ఏర్పరిచారు. మానసిక పరివర్తనతో ఆధ్యాత్మిక చింతన, పరమ పురుషార్దకరమైన మోక్షం, సదలవాట్లు పెంచుకోవడానికి ఉపవాసాది నియమాలు అందించారు. అలా రూపుదిద్దుకొన్నదే ’ఏకాదశీ వ్రతం’ ఈ ఏకాదశీ రోజున వేయి కనులతో వీక్షించి.సేవించి, తరి౦చాలని ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వమిది. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైషవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏట ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశీని ‘వైకుంఠ ఏకాదశి ‘ పండుగగా పరిగణిస్తారు ముక్కోటిఏకాదశి నాడు అన్ని వైషవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.

ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి.ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరుపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.

ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాకముందే పారణం(భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ‘ముక్కోటిఏకాదశి’ రోజున లభిస్తుందని పెద్దల మాట మానవులకి ముక్తిని ప్రసాదించడానికి శ్రీమహావిష్ణువే స్వయంగా ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించినట్లు శాస్త్ర వచనం.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading