Tiruchanur Padmavathi Ammavari Temple Festivals in September 2026

Tiruchanur Padmavathi Ammavari Temple no-watermark

Tiruchanur Padmavathi Ammavari Temple no-watermark

Tiruchanur Padmavathi Ammavari Temple Festivals in September 2026.. Several special religious festivals and rituals will be observed in September 2026 at the Tiruchanoor Sri Padmavathi Ammavari Temple and its affiliated temples.

A series of special religious festivals will be observed during August at the Sri Padmavathi Ammavari Temple and its affiliated temples at Tiruchanoor.

Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor

•  Sept. 4, 11, 18 & 25: Sri Padmavathi Ammavaru will bless devotees on a Tiruchi through the four Mada streets at 6 pm.

•  Sept. 22: On Uttarashada Nakshatram, Ammavaru will take a procession on Gaja Vahanam at 6.45 pm.

Sri Balaramakrishna Swamy Temple

•  Sept. 4: On Rohini Nakshatram, Sri Krishna Swamy will take a Tiruchi procession at 7 pm.

Sri Sundararaja Swamy Temple

•  Sept. 27: On Uttarabhadra Nakshatram, Sri Sundararaja Swamy will take a Tiruchi procession at 6 pm.

Sri Suryanarayana Swamy Temple

•  Sept. 13: On Hasta Nakshatram, Sri Suryanarayana Swamy will take a Tiruchi procession at 5 pm.

Tiruchanoor Srinivasa Temple

•  Sept. 5, 12, 19 & 26: Special Abhishekam will be performed to the Moolavirat of Sri Venkateswara Swamy.

Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple

•  Sept. 1: Ashtadala Padapadmaradhana Seva at 8 am.

•  Sept. 4, 11, 18 & 25: Vastra Alankarana Seva and Abhishekam at 7 am.

•  Sept. 9: Ashtottara Shata Kalasabhishekam at 8 am.

•  Sept. 23: Grand Kalyanotsavam of Sri Prasanna Venkateswara Swamy with Sridevi and Bhudevi.

•  Sept. 6, 13, 20 & 27: Abhishekam to Sri Prasanna Anjaneya Swamy at 8.15 am.

Devotees are requested to participate in these special festivals and sevas and receive the blessings of the deities.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

సెప్టెంబరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2026 ఆగస్టు 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు, సేవలు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో..

సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సెప్టెంబరు 22న ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

శ్రీ బలరామకృష్ణస్వామి ఆలయంలో..

సెప్టెంబరు 4న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణస్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో..

సెప్టెంబరు 27న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సుందరరాజస్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో..

సెప్టెంబరు 13న హస్తా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ సూర్యనారాయణస్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో..

సెప్టెంబరు 5, 12, 19, 26వ తేదీల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించనున్నారు.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో..

సెప్టెంబరు 1న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 9న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో ఉదయం 8.15 గంటలకు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading