Narasimha Jayanthi, Vengamamba Jayanthi in Tirumala on 30 April 2026

Narasimha Jayanthi, Vengamamba Jayanthi in Tirumala on 30 April 2026… The auspicious ceremonies of Narasimha Jayanthi and ardent devotee Matrusri Tarigonda Vengamamba Jayanthi will be observed in Tirumala on April 30, 2026.

In the advent of Swathi Nakshatram in Vaisakha month, Sri Nrisimha Jayanthi is observed in Tirumala temple. Special Abhishekam to the Mula murthi of Sri Yoga Narasimha Swamy will be performed on that day.

Meanwhile pushpanjali will be offered to Tarigonda Vengamamba memorial located in Tirumala.

In the evening, the utsava murthies of Sri Malayappa Swamy along with Sri Devi and Bhu Devi will reach Narayanagiri Gardens and Unjal Seva is performed followed by devotional cultural programmes.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

ఏప్రిల్ 30 శ్రీ నృసింహ జ‌యంతిమాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి

శ్రీ‌ నృసింహ జ‌యంతి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతిని ఏప్రిల్ 30వ తేదీన తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీ నృసింహ జ‌యంతి

ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో శ్రీ నృసింహ జ‌యంతి ఉత్సవం చేపడతారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.

శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది.

యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి.

క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.

వెంగమాంబ జయంతి :

శ్రీవారు, నరసింహ స్వామి భక్తగ్రేసరురాలైన మాతృశ్రీ తారీగొండ వెంగమాంబ జయంతి కూడా ఏప్రిల్ 30న జరుగనుంది.

ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు.

అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి పరిణయ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ వెంగమాంబ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు.

నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయనాంచారులతో కలిసి శ్రీ మలయప్పస్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఇందులో టీటీడీ అధికారులు, వెంగమాంబ వంశస్థులు పాల్గొంటారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading