TTD is organising Pavitrotsavams at Sri Maragathavalli Sameta Agastheshwara Swamy temple and Sri Parashareshwara Swamy temples of Narayanavanam.
The Pavitrotsavams in this ancient Shiva temple will be observed on September 18 and 19 with Ankurarpanam on September 17.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 18, 19వ తేదీల్లో శ్రీ పరాశరేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 18, 19వ తేదీల్లో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబరు 17వ తేదీ సాయంత్రం విఘ్నేశ్వర స్వామివారి పూజ, వాస్తుశాంతి, యాగశాల పూజ, అంకురార్పణ నిర్వహిస్తారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 18న యాగశాలలో పవిత్రమాలలకు పూజలు, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా సెప్టెంబరు 19న ఉదయం మహా పూర్ణాహుతి, యాగశాలపూజ, పట్టు పవిత్రాలను స్వామి, అమ్మవార్లు, పరివార దేవతలకు సమర్పిస్తారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.