Mahant Utsavam in Tiruchanoor Padmavathi Temple

TTD grandly organised Mahant utsavam at Sri Padmavati temple, Tiruchanoor on Tuesday morning, 3 December 2019.

The mahant of Sri Hathiramji mutt Sri Arjun Das presented silk vastram to Goddess Padmavathi on the occasion and thereafter the utsava idols were returned to temple in a procession.

Temple DyEO Sri Govindarajan, AEO Sri Subramanyam,temple inspector Sri Kola Srinivasulu and VI Sri Suresh and others devotees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

తిరుచానూరులో వేడుక‌గా మ‌హంతు ఉత్స‌వం

తిరుపతి, 2019 డిసెంబరు 03: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి మంగ‌ళ‌వారం మ‌హంతు ఉత్స‌వం వేడుక‌గా జ‌రిగింది.

ముందుగా ఆల‌యం నుండి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌ను తిరుచానూరులోని శ్రీ సీతారామ క‌ల్యాణ‌మండ‌పం వ‌ద్ద‌గ‌ల శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్దకు వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారికి ప‌లుర‌కాల సుగంధ ద్ర‌వ్యాల‌తో స్నపన తిరుమంజనం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా హ‌థీరాంజీ మ‌ఠం మ‌హంతు శ్రీ అర్జున్‌దాస్ అమ్మ‌వారి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఆ త‌రువాత ప‌ల్ల‌కీపై అమ్మ‌వారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజన్‌, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కోలా శ్రీ‌నివాసులు, విఐ శ్రీ సురేష్‌, భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment