మే 15 నుండి కార్వేటినగరంలోని శ్రీరామాలయంలో మహాభారత సప్తాహము
తిరుపతి, 2019 మే 14: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధ్వర్యంలో మే 15 నుండి 21వ తేదీ వరకు కార్వేటినగరంలోని ఆర్.కె.వి.బి.పేట శ్రీరామాలయంలో శ్రీ మదాంద్ర మహాభారత సప్తాహము కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ప్రతి రోజు సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు సామూహిక భజన, హరికథ, గోపూజ, కుంకుమపూజ, భక్తి సంగీతం, ధార్మిక సందేశం, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.