TTD proposes to perform Laksha Kumkumarchana for Goddess Kamakshi at Sri Kapileswara Temple on August 30, 2019 (Tirupati).
Interested devotees could participate with Rs 200 ticket for two persons and beget one Laddu m kumkuma prasadam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
తిరుపతి, 2019 ఆగస్టు 26: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 30వ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
రూ.200/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక లడ్డూ, కుంకుమ ప్రసాదంగా అందజేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.