The annual Brahmotsavams in Sri Prasanna Venkateswara Swamy temple at Kosuvaripalle of Tamballapalle in Annamaiah district will be observed from January 19 to 27 with Ankurarpanam on January 18.
The important days includes Dhwajarohanam on January 19, Garuda Seva and Kalyanotsavam on January 24, Radhotsavam on January 25, Vasanthotsavam and Dhwajavarohanam on January 27.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జనవరి 19 నుండి 27 తేదీ వరకు కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 18వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
కాగా, జనవరి 24వ తేదీ రాత్రి 08.00 గం.ల నుండి 10.00 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. జనవరి 28న ఉదయం 10.గం.లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరుగనుంది.వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 08.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు రాత్రి 08.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
19 January 2026 ఉదయం – ధ్వజారోహణం (కుంభ లగ్నం) రాత్రి – పల్లకి ఉత్సవం
20 January 2026 ఉదయం – శేష వాహనం రాత్రి – హంస వాహనం
21 January 2026 ఉదయం – ముత్యపుపందిరి వాహనం రాత్రి – సింహ వాహనం
22 January 2026 ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – హనుమంత వాహనం
23 January 2026 ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం
24 January 2026 ఉదయం – సర్వభూపాల వాహనం రాత్రి – కల్యాణోత్సవం, గరుడ వాహనం (రాత్రి 10.30 గం.లకు)
25 January 2026 ఉదయం – రథోత్సవం రాత్రి – గజ వాహనం
26 January 2026 ఉదయం – పల్లకి ఉత్సవం రాత్రి – అశ్వ వాహనం
27 January 2026 ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం రాత్రి – ధ్వజావరోహణం
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.