Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Koil Alwar Tirumanjanam on July 16, 2019

The traditional temple cleansing fete, Koil Alwar Tirumanjanam will be observed in Tirumala temple on July 16, 2019 in connection with Anivara Asthanam.

This fete will be observed on that day between 6am and 11am. The darshan for pilgrims will commence from 12noon onwards. TTD has cancelled Astadala Pada Padmaradhana Seva in connection with this fete.
Anivara Asthanam will be celebrated in Tirumala on July 17.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో జూలై 16న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల,01 జూలై 2019; తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 16న మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఉదయం 6.00 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన, వ‌సంతోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ‌ సేవల‌ను టిటిడి రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment