Kartika Purana 24th Chapter in Telugu | కార్తీక పురాణము 24వ అధ్యాయము

Kartika Purana 24th Chapter in Telugu explains the story of Ambarisha’s Dwadashi Vratham. It also explains the significance and importance of Dwadashi Vratham.. It is recited on 24th day of Karthika Masam..

కార్తీక పురాణము 24వ అధ్యాయము

అంబరీషుని ద్వాదశీ వ్రతము

అత్రి మహా ముని మరల అగస్త్యుని తో “ఓ కుంభ సంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంత విచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపుము.

“గంగా, గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందు వలనను, సూర్య, చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులొనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి సార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతోదాన ధర్మములు చేయు వారికిని అంత ఫలమే కలుగునuు.ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ద్వాదశీ వ్రతము చేయు విధాన మెట్లో చెప్పెదను వినుము

కార్తీక శుద్ధ దశమి రోజున, పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యేకాదశి రోజున యే వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘఢియలు వచ్చిన తరువాతనే భుజింప వలయును. దీనికొక యితిహాసము కలదు. దానిని కూడ వివరించెదను. సావధానుడవై ఆలకింపు” మని యిట్లు చెప్పుచు న్నాడు.

పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు. ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడి వాడు. ఒక ద్వాదశి నాడు, ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆరోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయ దలచి సిద్ధముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియల లో పారాయణ చేయ వలయును గాన తొందరగా స్నానమున కేగి రమ్మన మని కోరెను. దూర్వాసుడందుల కంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు యెంత సేపు వేచి యున్ననూ దూర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తా నిట్లనుకొనెను. “ఇంటి కొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్లి యింత వరకు రాలేదు. బ్రాహ్మణున కాతిధ్య మిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహా పాపము. అది గృహస్థు నకు ధర్మము గాదు. ఆయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి ఘడియలు దాటి పోవును.వ్రత భంగమగును. ఈ ముని కోప స్వభావము గల వాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచ కున్నది. బ్రాహ్మణ భోజన మతిక్రమించ రాదు. ద్వాదశి ఘడియలు మించి పోకూడదు.్ ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన యెడల, హరి భక్తిని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడున్న వుపవాసము నిష్ఫల మగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియును గాక యీ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మ యందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు.” అని ఆలోచించి “బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహా విష్ణువే బోగొట్ట గలడు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి” దని, సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.

“ఓ పండిత శ్రేష్ఠులారా! నిన్నటి దినమున యేకాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించ వలసి యున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహా ముని విచ్చేసిరి. ఆ మహా మునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి యింత వరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింప వచ్చునా ?లేక వ్రత భంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి యుండ వలెనా ? ఈ రెంటిలో యేది ముఖ్య మైనదో తెలుప వలసిన” దని కోరెను. అంతట ఆ ధర్మజ్ఞు లైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి “మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భ కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్ని దేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణ వాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ – దప్పిక కలుగును. ఆ తాపము చల్లార్చ వలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంత పరచ వలెను. శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్ని దేవుడు. దేవత లందరి కంటే అధికుడై, దేవ పూజ్యుడైనాడు. ఆ యగ్ని దేవునందrరూసదా పూజింప వలెను. గృహస్థు, యింటికి వచ్చిన అతిథి కడ జాతి వాడైననూ “భోజన మిడుదు” నని చెప్పి వానికి పెట్ట కుండా తినరాఆయుక్షీణము కలుగుnను/ సదాచార సంపన్నడును అయిన దూర్వాస మహా మునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండాతాను భుజించుట వలన మహా పాపము కలుగును. అందు వలన ఆయు క్షీణము కలుగును. దూర్వాసునంతటి వానిని అవమాన మొనరించిన పాపము సంప్రాప్త మగును. అని విశద పరిచిరి

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.

Write Your Comment