Kareeri Isthi Yagam 2019 in Tirumala

The Yagam specifically performed to appease Rain God for good rains, Kareeri Isthi will be observed in Tirumala for five days from May 14 to 18, 2019.

This religious fete will take place at Paruveta Mandapam near Gogarbham dam with eminent ritwiks versed in this yagam.

While Rushyasringa Sloka Parayanam will be held in Varaha Swamy temple, Virata Parvam from Maha Bharatam will be rendered in Asthana Mandapam. On the other hand renowned musicians will recite Amrita Varshini Raagam in Nadaneerajanam from May 13 to 19 for a week.

Simultaneously, in Tirupathi, Varuna Japam coupled with Parjanya Shanti Homam will be rendered in Sri Kapileswara Swamy temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 14 నుండి 18 వరకు తిరుమలలోని గోగర్బం డ్యాం వద్ద కారీరిష్ఠి యాగం

తిరుమల, 2019 మే 07: సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలోను, దేశంలోను సుభిక్షత నెలకొనాలని ఆకాంక్షిస్తూ తిరుమలలోని గోగర్భం డ్యాం వద్ద మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజులపాటు కారీరిష్ఠి యాగంను టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనుంది.

ఇందులో భాగంగా మే 14 నుండి 18వ తేదీ వరకు ప్రముఖ పండితులు తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఋష్యశృంగ శ్లోక పారాయణము, ఆస్థాన మండపంలో మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేయనున్నారు. అదేవిధంగా మే 13 నుండి 19వ తేదీ వరకు ప్రముఖ కళాకారులతో నాదనీరాజనం వేదికపై అమృతవర్షిణి రాగ ఆలాపన నిర్వహించనున్నారు.

కాగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వరుణ జపం (పర్జన్య శాంతి హోమం) నిర్వహించనున్నారు.

వేద-శ్రౌత-స్మార్థ పండితులు ఈ యాగాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. వీరితోపాటు ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు కూడా ఈ యాగాల్లో పాలుపంచుకోనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment