Tirupati Govindarajaswamy Temple Festivals in May 2026

Tirupati Govindarajaswamy Temple Festivals in May 2026.. Several special festivals will be observed during the month of May at Sri Govindarajaswamy Temple in Tirupati.

On May 1, 2026 Ponnakalva Utsavam will be conducted.

On May 8 and 15, 2026 (Fridays), procession of Sri Andal Ammavari will be held in the four mada streets at 6 PM.

On May 9, 2026 on the occasion of Sravana Nakshatram, Sri Bhu Sameta Sri Kalyana Venkateswara Swamy will bless devotees in a procession at 6 PM.

Hanuman Jayanthi will be observed on May 12.

On May 18 , 2026 on Rohini Nakshatram, procession of Sri Parthasarathi Swamy with Sridevi and Bhudevi will be held at 6 PM. Koil Alwar Thirumanjanam will also be performed on the same day.

Nammalwar Utsavams will be observed from May 21 to 30.

Ankurarpanam for Brahmotsavams will be held on May 22.

Annual Brahmotsavams will be conducted from May 23 to 31, commencing with Dwajarohanam on May 23.

Garuda Vahanam will be on May 27 and Rathotsavam on May 30.

The festivities will conclude with Chakrasnanam and Dwajavarohanam on May 31.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి.

మే 1న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం జరుగుతుంది.

మే 8, 15 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు.

మే 9న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

మే 12న హనుమజ్జయంతి జరుపుకుంటారు.

మే 18న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతారు. అదే రోజు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

మే 21 నుండి 30వ తేదీ వరకు నమ్మాళ్వార్ ఉత్సవాలు జరుగుతాయి.

మే 22న శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది.

మే 23 నుండి 31 వరకు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు,  23న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

మే 27న గరుడవాహనం, మే 30న రథోత్సవం నిర్వహిస్తారు.

మే 31న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading