Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Govindarajaswamy Temple Koil Alwar Thirumanjanam

The Agama ritual of Koil Alwar Thirumanjanam was performed at Sri Govindarajaswamy temple on Wednesday (8 May 2019) morning ahead of annual Brahmotsavams commencing from May 11, 2019.

Tirupati Joint Executive Officer Sri B Lakshmi Kantham who participated in the event told reporters later that as a part of annual brahmotsavams Dwajarohanam will be held on May11, Garuda vahanam May15, Rathotsavam May 18 and Chakra snanam May 19 and devotees will participate in large numbers for which elaborate arrangements are being made.

After morning rituals and thirumanjanam, devotees were allowed for darshan and chinnna veedhi Utsavam was performed in the morning while Pedda veedi utsavam will be performed in the evening.

DyEO Smt.Varalakshmi, AEO Sri Uday Bhaskar Reddy, Superintendent Sri Gnana Prakash and other archakas participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

మే 08, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం మీడియాతో మాట్లాడుతూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నంలో భాగంగా గ‌ర్భాల‌యం, ఉప ఆల‌యాల‌ను శుద్ధి చేసిన‌ట్టు తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మే 11న ధ్వ‌జారోహ‌ణం, మే 15న గ‌రుడ‌సేవ‌, మే 18న రథోత్స‌వం, మే 19న చ‌క్ర‌స్నానం జ‌రుగ‌నున్న‌ట్టు వివ‌రించారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని, ప‌రిస‌ర ప్రాంతాల భ‌క్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు.

ముందుగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, స‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వహించారు. ఆ తరువాత కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండాల్‌ అమ్మవారు, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ పుండరికవల్లీ ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఆ త‌రువాత ఉద‌యం చిన్న వీధి ఉత్స‌వం, సాయంత్రం పెద్ద వీధి ఉత్స‌వం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, శ్రీ శ్రీ‌హ‌రి, ఎవిఎస్‌వో శ్రీ రాజేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కృష్ణ‌మూర్తి, అర్చక బృందం పాల్గొన్నారు.

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు :

తేదీ ఉదయం సాయంత్రం

11-05-2019(శ‌నివారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

12-05-2019(ఆదివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

13-05-2019(సోమ‌వారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

14-05-2019(మంగ‌ళ‌వారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

15-05-2019(బుధ‌వారం) మోహినీ అవతారం గరుడ వాహనం

16-05-2019(గురువారం) హనుమంత వాహనం గజ వాహనం

17-05-2019(శుక్ర‌వారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

18-05-2019(శ‌నివారం) రథోత్సవం అశ్వవాహనం

19-05-2019(ఆదివారం) చక్రస్నానం ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment