Govindaraja Swamy Pushpayagam 2026

Govindaraja Swamy Pushpayagam 2026… The annual Pushpa Yagam will be performed in Sri Govindaraja Swamy temple on June 22 in 2026.  For this purpose, Ankurarpanam will be held on June 21. 

As part of the festivities, Senadhipati Utsavam and Ankurarpanam will be conducted on June 21 from 5.30 p.m. to 8.30 p.m.

On June 22, Snapana Tirumanjanam will be performed at 9.30 a.m., followed by the Pushpayagam from 1 p.m. to 4 p.m. The deity will be worshipped with a variety of fragrant flowers and sacred leaves. A grand Veedhi Utsavam will be held at 6 p.m.

Temple priests said the Pushpayagam is performed as an atonement ritual for any inadvertent lapses that may occur during Brahmotsavams and daily temple rituals.

Couples can participate in this sacred seva by purchasing a ticket priced at Rs.516 and seek the blessings of the Lord, temple officials said.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 22 వైభవంగా పుష్పయాగ మహోత్సవం

సుగంధ పుష్పాలతో స్వామివారికి విశేష ఆరాధన

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 22న పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఇందుకోసం జూన్ 21న సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగ అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి.

జూన్ 22న ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించగా, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా వివిధ రకాల సుగంధ పుష్పాలు, పవిత్ర పత్రాలతో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం వైభవంగా జరుగనుంది.

లోప పరిహారార్థం పుష్పయాగం

వార్షిక బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల నిర్వహణలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.516/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్ర పుష్పయాగ సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading