Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Special Fire Control Measures in TTD Forests

Special Fire Control Measures in TTD Forests, Seshachalam forests.. With the advent of hot summer, as the incidents forest fire may occur in Seshachala angels, the TTD forest department is fully prepared to meet any contingency.

According to TTD Forest officer Sri D Phanikumar Naidu the TTD has rolled out special measures including setting up of Watch towers, fire lines and fire fighting squads to guard the forest wealth from fire accidents during hot summer months.

FIRE FIGHTING MEASURES

He said TTD has set 40 feet high 4 watchtowers in Tirupati and 5 towers in Tirumala forest belt comprising of 2950 hectares area. A full-fledged and well-equipped forest fire fighting squad is also kept on 24×7 basis to trace the fire spots with smoke visibility. The areas under watch tower cover includes Nakkala vanka, Samidhula plots, firewood depot, SV Poor Home Nursery, in Tirupati range and Narayanagiri Padalu, Kakulakonda, windmills area, Chittekkudu (Gali Gopuram point).

FIRE GUARDS

He said two forest guards would keep watch on 24-hour basis. While fire fighting squads comprised of 80 members at Tirupati and 70 in Tirumala to keep 24 x7 watch and provided with two vehicles for each zone for faster reach of the fire spot. They use blowers to remove dry leaves and use fire engines on roadside spots.

FIRE LINES

The TTD has also dug up 49 kms of fire lines of 10×20 meters size amidst the thick shrubs and forest trees to break the spread of fire.

QUENCHING THE THIRST OF ANIMALS

TTD is contemplating to put up 45 cement water pits (water tanks) in addition to existing in the forest belt for use to feed the thirsty wild animals.

During summer when many streams dry up, the cement pits are modelled in shape of a saucer to facilitate easy access to animals.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు : వాచ్‌టవర్ల ద్వారా పర్యవేక్షణ

నిరంతరం అప్రమత్తంగా ఫైర్‌ ఫైటింగ్‌ స్క్వాడ్‌ మంటలు వ్యాప్తి కాకుండా ఫైర్‌ లైన్స్‌

తిరుమల, 2019 మార్చి 26: వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు టిటిడి పటిష్టమైన చర్యలు తీసుకుంది. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, ప్రమాదాల నివారణకు పలు ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల, తిరుపతిలోని వాచ్‌టవర్ల ద్వారా సిబ్బంది నిరంతరం అటవీ ప్రాంతాన్ని పరిశీస్తున్నారు. ఎక్కడైనా మంటలు వ్యాపిస్తే వెంటనే స్పందించి అదుపు చేసేందుకు వీలుగా ఫైర్‌ ఫైటింగ్‌ స్క్వాడ్‌ నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు. టిటిడి డిఎఫ్‌వో శ్రీ డి.ఫణికుమార్‌ నాయుడు పర్యవేక్షణలో అటవీ సంరక్షణ చర్యలు జరుగుతున్నాయి.

టిటిడి పరిధిలో 2,950 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ మొత్తం ప్రాంతాన్ని పరిశీలించేందుకు తిరుమలలో 4, తిరుపతిలో 4 వాచ్‌ టవర్లు ఉన్నాయి. సుమారు 40 అడుగుల ఎత్తు గల ఈ వాచ్‌ టవర్లపై నుండి అటవీ ప్రాంతంలో మంటల కారణంగా వచ్చే పొగను సిబ్బంది సులువుగా గుర్తిస్తారు. తిరుపతిలో నక్కలవంక, సమిధుల ప్లాటు, కట్టెల డిపో, ఎస్వీ పూర్‌ హోమ్‌ నర్సరీ, తిరుమలలో నారాయణగిరి పాదాలు, కాకులకొండ, ఫ్యాన్లగుట్ట, చిట్టెక్కుడు(గాలిగోపురం వద్ద) ప్రాంతాల్లో వాచ్‌ టవర్లు ఉన్నాయి. ఒక్కో వాచ్‌ టవర్‌లో ఇద్దరు చొప్పున 24 గంటల పాటు టిటిడి అటవీ సిబ్బంది ఉంటారు. ఆకతాయిలు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లి నిప్పు పెట్టడం, ఎండ వేడి ఎక్కువగా ఉన్నపుడు, విపరీతమైన గాలి వీచినపుడు చెట్ల కొమ్మలు రాసుకోవడం వల్ల నిప్పు పుడుతుండడం, పిడుగులు పడడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఫైర్‌ ఫైటింగ్‌ స్క్వాడ్‌ :

ఫైర్‌ ఫైటింగ్‌ స్క్వాడ్‌ పేరుతో తిరుపతిలో 80 మంది, తిరుమలలో 70 సిబ్బంది షిప్టుల వారీగా 24 గంటల పాటు విధుల్లో ఉంటారు. వీరికి తిరుపతిలో 2, తిరుమలలో 2 వాహనాలున్నాయి. సిబ్బంది బృందాలుగా విడిపోయి అటవీ ప్రాంతాన్ని తనిఖీ చేస్తుంటారు. మంటలు వ్యాపించినపుడు వెంటనే అక్కడికి చేరుకుని అదుపుచేస్తారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా బ్లోయర్ల ద్వారా ఎండుటాకులను తొలగిస్తారు. రోడ్డు మార్గం ఉన్న పక్షంలో ఫైరింజన్‌ సహకారం తీసుకుంటారు. అగ్నిప్రమాదాలు జరిగినపుడు మంటలు వ్యాప్తి చెందకుండా 40 కిలోమీట‌ర్లు ఫైర్‌లైన్లను టిటిడి ఏర్పాటుచేసింది. 10 మీటర్లు, 20 మీటర్ల వెడల్పుతో ఒకే వరుసలో చెట్లను, ఎండుటాకులను తొలగించి శుభ్రంగా ఉంచుతారు. అటవీప్రాంతంలో అక్కడక్కడా ఈ ఫైర్‌లైన్లను ఏర్పాటుచేశారు.

సిబ్బందికి అవ‌గాహ‌న :

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని వ‌కుళామాత పోటు, బూంది తయారుచేసే పోటు, గ్యాస్‌ ప్లాంట్‌, త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో విధులు నిర్వ‌హించే సిబ్బందికి, టిటిడి విజిలెన్స్, హోమ్ గార్డుల‌కు జిల్లా అసిస్టెంట్ ఫైర్ అధికారి శ్రీ హేమంత్‌రెడ్డి అధ్వ‌ర్యంలో తిరుమ‌ల‌లోని పిఏసి-4లో శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా అగ్ని ప్రమాదాలు సంభవించిన పక్షంలో వెంటనే మంటలను ఎలా ఆర్పాలి అనే అంశంపై అగ్నిమాపక సిబ్బంది వీరికి వివరించారు. అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్ప‌డు దాని తీవ్ర‌త‌ను బ‌ట్టి ఫైర్ గ్యాస్ (కార్భ‌న్ డై అక్సైడ్‌), ఏబిసి ( ఏ-క్లాస్‌), ఫోమ్‌, డ్రై కెమిక‌ల్ పౌడ‌ర్‌, అడ్వ‌న్సుడు ఫైర్ ఫైట‌ర్ టెక్నాల‌జీని ఎప్ప‌డు ఎలా ఉప‌యోగించాలి అనే దానిపై ప్రత్యక్షంగా (ఆచ‌ర‌ణాత్మ‌కంగా) శిక్ష‌ణ‌ ఇచ్చారు.

ఫైర్ ఇంజ‌న్లు :

తిరుమ‌ల‌లో రెండు ఫైర్ ఇంజ‌న్లు, ఒక మిస్ట్ బుల్లెట్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాప‌క శాఖ ఫైర్ ఇంజ‌న్‌లో నీటిని మాత్ర‌మే నిల్వవుంచ‌గా, టిటిడి ఫైర్ ఇంజ‌న్‌లో నీరు, ఫోమ్‌, డ్రై కెమిక‌ల్ పౌండ‌ర్‌తో ప్ర‌మాదాల‌ను వెంట‌నే నివారించేలా రూపొందించారు. తిరుమ‌ల‌లో 16 మంది ఫైర్ సిబ్బంది, 33 మంది హోమ్ గార్డులు షిప్టుల వారీగా 24 గంటల పాటు విధుల్లో ఉంటారు. అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు టిటిడి వాట‌ర్ ట్యాంకులతో నీటిని ఫైర్ ఇంజ‌న్ల‌కు అందించ‌డం ద్వారా, టిటిడి అట‌వీ, విజిలెన్స్ సిబ్బంది స‌హ‌కారంతో అగ్నిమాప‌క సిబ్బంది అట‌వీ ప్రాంతంలో మంట‌లు విస్త‌రించ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

సాసర్‌ పిట్స్‌(సిమెంటు తొట్టెలు) :

వేసవిలో అడవి జంతువుల దాహార్తిని తీర్చేందుకు ఘాట్‌ రోడ్లలోని తొట్టెల్లో క్రమం తప్పకుండా నీటిని నింపుతున్నారు. అటవీ ప్రాంతంలో పలు చోట్ల 45 సాసర్‌పిట్సును (సిమెంటు తొట్టెలు) టిటిడి ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మ‌రో 45 సాసర్‌పిట్స్ ఏర్పాటు చేయ‌నుంది. ఈ తొట్టెలు సాసర్‌ ఆకారంలో ఉంటాయి. కొన్ని జంతువులకు నీటి లోపలికి దిగి తాగడం అలవాటు. ఈ కారణంగా జంతువులు సులువుగా నీటిలోకి దిగి, తిరిగి వెళ్లేందుకు వీలుగా ఈ రకమైన తొట్టెలను నిర్మించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment