Devi Navaratri at Tirupati Kapileshwara Swamy Temple, 22 September – 2 October 2025

Devi Navaratri at Tirupati Kapileshwara Swamy Temple, 22 September – 2 October 2025.. The Navaratri celebrations of Sri Kamakshi Ammavaru will be conducted with grandeur at Sri Kapileswara Swamy Temple, Tirupati, from September 22 to October 02, 2025. On each day, the deity will bless devotees in a distinct alankaram.

Necessary arrangements are being made in the temple premises for the smooth conduct of the festivities.

As part of the program, Koil Alwar Tirumanjanam will be performed on September 18 from 11:30 am to 2:30 p.m. The celebrations will commence on September 22, from 6 pm to 8pm with Ganapati Puja, Punyahavachanam, Ankurarpanam, Nava Kalasha Sthapanam, and Vastu Puja.

The schedule of daily alankarams is as follows:

September 23, 2025 – Sri Kamakshi Devi

September 24, 2025 – Sri Adi Parashakti

September 25, 2025 – Mavadi Seva Alankaram

September 26, 2025 – Sri Gayatri Alankaram

September 27, 2025 – Bala Tripura Sundari

September 28, 2025 – Sri Mahalakshmi Ammavaru

September 29, 2025 – Sri Annapurna Devi

September 30, 2025 – Sri Mahishasura Mardini

October 1, 2025 – Sri Saraswati Devi

October 2, 2025 – Sri Shivaparvati Alankaram

On the concluding day on October 02, Parveta Utsavam will be organized at 6 p.m. in the premises of Sri Abhayahasta Anjaneyaswamy Temple.

In connection with these festivities, devotional music concerts, pravachanams on Devi Bhagavatam, and recitations of Lalita Sahasranama will be conducted under the auspices of TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 22 నుండి అక్టోబ‌రు 2 తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబ‌రు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 18న ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల వ‌ర‌కు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలకు సెప్టెంబరు 22న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చ‌నం, అంకురార్ప‌ణ‌, న‌వ క‌ల‌శ స్థాప‌న‌, వాస్తుపూజ నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా  సెప్టెంబరు 23న శ్రీ కామాక్షి దేవి, సెప్టెంబరు 24న శ్రీ ఆదిపరాశక్తి, సెప్టెంబరు 25న మావడి సేవ అలంకారం, సెప్టెంబ‌రు 26న శ్రీ గాయ‌త్రి అలంకారం, సెప్టెంబరు 27న బాల త్రిపుర సుంద‌రి, సెప్టెంబరు 28న శ్రీ మ‌హాలక్ష్మీ అమ్మ‌వారు, సెప్టెంబ‌రు 29న‌ శ్రీ‌అన్నపూర్ణాదేవి, సెప్టెంబరు 30న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబరు 1న శ్రీ‌ సరస్వతి దేవి, అక్టోబరు 2న శ్రీ శివ‌పార్వ‌తుల‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 2న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంట‌ల‌కు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading