Bhashyakarula Sattumora in Tirumala Temple – 9 May 2019

Sri Bhashyakarula Sattumora will be observed in Srivari temple in Tirumala.

Bhashyakarulavaru is the title given to the famous Sri Vaishnava Saint Sri Ramanujacharya for penning Sri Bhashyam.

The Bhashyakarula utsavam commenced in Tirumala on April 30 and will conclude on May 18. On May 9, the Bhashyakarula Sattumora will be observed.

After Sahasra Deepalankara Seva on this day, along with Sri Malayappa-Sri-Bhudevis, Sri Bhashyakarula Varu will also be taken on a celestial procession in Tiruchi along four mada streets and special festival is rendered in Bhashyakarulavari Sannidhi.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 9న శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తుమొర

తిరుమల, 2019 మే 04: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 9వ తేదీన గురువారం భాష్యకార్ల సాత్తుమొర జరుగనుంది. ఈ ఉత్సవం సందర్భంగా ఏప్రిల్ 30 నుండి మే 18వ తేదీ వరకు 19 రోజులపాటు ఉభయం సమర్పణ జ‌రుగుతుంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భాష్యకార్ల సాత్తుమొర నిర్వ‌హిస్తారు.

శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.00 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వసంతోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment