The sankeertans penned by saint poet Sri Tallapaka Annamacharya are extemporaneous said the scholars.
During the literary meet held at Annamacharya Kalamandiram in Tirupati on Tuesday on the occasion of 611th Jayanti of the great poet, many scholars spoke on the versatility of his writing skills.
Dr G Venkat, Dr Rama prabha, Dr Govinda raju rendered scholarly lectures on the life of the saint poet.
Later in the evening Annamacharya sankeertans were rendered by artistes at Annamacharya Kalamandiram and also at Mahati Auditorium.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్నమయ్య వర్ణనా వైచిత్రి నిరుపమానం : డా.. గరికపాటి వెంకట్
మే 21, తిరుపతి, 2019: శ్రీ తాళ్లపాక అన్నమయ్య వర్ణనా వైచిత్రి నిరుపమానమని, తన సంకీర్తనల్లోని శృంగార నాయికల భావాలను మధురభక్తితో చక్కగా వర్ణించారని విశాఖపట్నానికి చెందిన డా.. గరికపాటి వెంకట్ పేర్కొన్నారు. అన్నమయ్య 611వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మూడు రోజుల పాటు జరిగిన సాహితీ సదస్సులు మంగళవారం ముగిశాయి.
ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన డా.. గరికపాటి వెంకట్ ‘అన్నమయ్య శృంగార నాయికలు – వర్ణనా వైభవం’ అనే అంశంపై ఉపన్యసిస్తూ అన్నమయ్య శృంగార సంకీర్తనల భావ వైశాల్యం కొలవడమంటే సముద్రంలోని తరంగాల సంఖ్యను లెక్కించడం లాంటిదన్నారు. అన్నమయ్య శృంగార సంకీర్తనల్లో భాగవతంలోని మధురభక్తి, జయదేవుని అష్టపదుల్లోని వర్ణనా వైచిత్రి మిళితమై ఉంటుందని తెలిపారు. పలుకు తేనెల తల్లి పవళించెను…., ఏమని పొగడుదమే, ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగా…, అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్మంగ…. అంటూ రచించిన సంకీర్తనల్లో అలమేల్మంగను వర్ణించిన తీరు గొప్పగా ఉంటుందన్నారు.
హైదరాబాద్‌కు చెందిన డా…రమాప్రభ ‘అన్నమయ్య పదబంధాలు – సంగీత శాస్త్ర సమన్వయం ‘ అనే అంశంపై ఉపన్యసిస్తూ వేదాల సారాన్ని అలతి అలతి పదాలతో పండిత పామరులకు చేర్చిన మహనీయుడు అన్నమయ్య అన్నారు. సంగీతం, ఆధ్యాత్మికత జంట నాగస్వరాల లాగ మన శరీరంలోని కుండలినీ శక్తిని తట్టి లేపుతాయని తెలిపారు. శ్రీవారికి ఇటు సంగీతం, అటు సాహిత్యం ద్వారా పదాభిషేకం చేసి పట్టం గట్టిన వాగ్గేయ శిరోమణి అన్నమయ్య అన్నారు.
తిరుపతికి చెందిన డా.. సి.గోవిందరాజు ‘అన్నమయ్య ఉత్సవ సంప్రదాయ కీర్తనలు – ఒక పరిశీలన’ అనే అంశంపై మాట్లాడుతూ ఉత్సవాలు జనసమీకరణకు, విశ్వాసప్రకటనకు, సమైక్యతకు, కళాప్రదర్శనకు ఉపకకరిస్తాయని, ఉత్సవాల వల్ల ఉల్లాసం, వినోదం కలుగుతాయని వివరించారు. శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, పవిత్రోత్సవాలు తదితర ఉత్సవాలు, సేవలకు సంబంధించి సంకీర్తనలు రచించారని తెలియజేశారు. ఆ తరువాత వారణాసికి చెందిన డా.. బి.సత్యవరప్రసాద్ ‘అన్నమయ్య సంకీర్తనల్లో హనుమంతుడు’ అనే అంశంపై ఉపన్యసించారు.
సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు తిరుపతికి చెందిన ఆచార్య ద్వారం లక్ష్మీ గాత్ర సంగీతం, రాత్రి 7.30 గంటలకు తిరుపతికి చెందిన శ్రీ బి.శేషగిరిరావు బృందం గాత్ర సంగీత కచేరి నిర్వహిస్తారు.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు విజయవాడకు చెందిన విష్ణుభట్ల సిస్టర్స్(కృష్ణవేణి) గాత్ర సంగీత కార్యక్రమం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ బి.విశ్వనాథ్, ఏఈవో శ్రీమతి విఆర్.శాంతి, రీసెర్చి అసిస్టెంట్ డా.. సి.లత, సిబ్బంది శ్రీ నరసింహులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.