Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Annamaiah-Vengamamba Sahitya Vaibhavam book released

A book on Annamaiah-Vengamamba Sahitya Vaibhavam was released by Tirupati JEO Sri B Lakshmikantham in his camp office, on the occasion of 611th Jayanthi of Saint Poet Sri Tallapaka Annamacharya in Tirupati on Tuesday.

The JEO said about 23 renowned scholars have contributed different essays on the life style and works of the legendary writers Annamaiah and Vengamama in this book.

Some of the well known scholars who have penned some scholarly articles in this book includes Dr Samudrala Lakshmanaiah, Dr KJ Krishnamurthy, Dr Medasani Mohan, Dr Peta Srinivasulu Reddy and others.

Annamacharya Project Director Prof.B.Vishwanatham was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నమయ్య – వెంగమాంబ సాహిత్య వైభవం పుస్తకావిష్కరణ

మే 21, తిరుపతి, 2019: శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 611వ జయంతి మహోత్సవాల సందర్భంగా మూడో రోజు మంగళవారం జెఈవో క్యాంప్ కార్యాలయంలో అన్నమయ్య – వెంగమాంబ సాహిత్య వైభవం పుస్తకాన్ని టిటిడి జెఈవో శ్రీ బి. లక్ష్మీకాంతం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ 23 మంది ప్రముఖ పండితులు రచించిన వివిధ అంశాలను పుస్తకం రూపంలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇందులో డా. మేడసాని మోహన్ – అన్నమయ్య విశిష్టాద్వైతం, నడుపల్లి శ్రీ రామరాజు – నిశ్శబ్ద సాహిత్యోద్యమకారుడు అన్నమయ్య, డా. బూదాటి వెంకటేశ్వర్లు – అన్నమయ్య సంకీర్తనలు – దేశిసంప్రదాయం, డా. శరత్ జ్యోత్స్నారాణి – అన్నమయ్య సంకీర్తనలు – సామాజికాంశాలు, డా.సముద్రాల లక్ష్మణయ్య – అన్నమయ్య పాండిత్య ప్రతిభాపాటవాలు, ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి – అన్నమయ్య సంకీర్తనలూ – ఐతిహ్యాలు, ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు – అన్నమయ్య కీర్తనలు – గూఢార్థవివరణ, ఆచార్య కె.జె. కృష్ణమూర్తి – తెనుగు సాహిత్యము – తరిగొండ వెంగమాంబ, డా. సంగీతం కేశవులు – తరిగొండ వెంగమాంబ జీవితం – సాహిత్యం – పరిశీలన తదితర అంశాలమీద తమ వ్యాసాలను రచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ బి.విశ్వనాథ్‌, ఏఈవో శ్రీమతి విఆర్‌.శాంతి, సూపరింటెండెంట్ శ్రీ కె. సూర్యనారాయణ రెడ్డి, సిబ్బంది శ్రీ బి. న‌ర‌సింహులు, శ్రీ జి. భాస్కర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment