నిత్య జీవితంలో ఉపయోగపడే 11 రెమిడీస్.. Few Remedies useful in daily life..
1. జాతకంలో గ్రహబాధలు ఉన్నవారు గురువారం రోజు సూర్యోదయం ఐన తరువాత శివదర్శనం చేసుకోండి ఇలా 9 వారాలు చెయ్యండి ఎటువంటి గ్రహ బాధలు ఐన తొలిగిపోతాయి.
2. ఎటువంటి అనారోగ్య సమస్య ఐన విష్ణు సహస్రనామం మరియు దత్తాత్రేయ వజ్రకవచం చదవటం వాళ్ళ తొలిగిపోతాయి.
3. శ్రీ మహాలక్ష్మి దేవికి సంపెంగపూలతో పూజించటం ద్వారా ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయి.
4. వాయువ్య దిశలో తిరిగి జపం చెయ్యటం ద్వారా గురువు ఆశీర్వాదములు త్వరగా పొందవచ్చు.
5. ఇంట్లో ఆడపిల్లలకు వివాహం ఆలస్యం అవుతుంటే ప్రతీరోజు శ్రీమహాలక్ష్మి దేవిని శ్రీ సూక్తం తో అభిషేకం చెయ్యండి.
6. పిరమిడ్ లో శ్రీ శుభ దృష్టి గణపతి బొమ్మ వేయించండి. అది గొప్ప అదృష్టాన్ని తీసుకొని వస్తుంది.
7. తల్లి, తండ్రి, గురువుని మీరు కూర్చున్న సమయంలో మీకంటే ఎత్తులో ఉన్న ఆసనంలో కుర్చోపెట్టండి.
8.పూజ చేసే సమయంలో మన ఆసనం దేవుడి ఆసనం కన్నా ఎత్తులో ఉండరాదు.
9. అగ్ని ఎక్కడ ఉన్న దానిని దాటకండి ఆయుక్షీణం జరుగుతుంది.
10. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో మంగళవారం లేదా శుక్రవారం రోజున కర్పూర దానం ఇవ్వటం మూలంగా భార్య భర్తల మధ్య గొడవలు రావు.
11. రాహు గ్రహ బాధ నివారణ కొరకు బాసర క్షేత్రంలో ఉన్న సరస్వతి అమ్మవారిని దర్శించుకొని చండీయాగం చేయించుకుంటే ఉత్తమము. బాసర సరస్వతి క్షేత్రం గొప్ప మహిమాన్వితమైనది అక్కడ ప్రతీరోజు నిత్య చండీయాగం జరుగుతుంది.