లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు

ఆస్తికుల నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి ఎలాంటి వస్తువులలో నివాసం ఉంటుందంటే వారు చెప్పే సమాధానాలు ఇవి :
1. దక్షిణావర్త శంఖం
2. ముత్యాల శంఖం
3. ఏకాక్షి నారికేళం
ఈ వస్తువులను పూజామందిరంలో వుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
1. దక్షిణావర్త శంఖం : ఈ శంఖం కడుపు ఊదేవారి కుడివైపుకు తెరచుకుని వుంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్త శంఖం శంఖం అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరచుకుని ఉండేవి వామావర్తి శంఖమని అంటారు. లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు అంత ఇష్టం అంటే … లక్ష్మీదేవి సముద్రంనుండి జన్మించింది. శంఖం కూడా మనకు సముద్రంలోనే దొరుకుతాయి. మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖాలే కావడం విశేషం. అయితే దక్షిణావర్త శంఖం దొరకడం కష్టసాధ్యమే అయినా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా వర్ణిస్తారు మునిశ్రేష్టులు. దక్షిణావర్తి శంఖాలు మోగవు … కానీ మొగేవి దొరికితే పూజామందిరంలో పెట్టుకుని పూజించాలి. పగిలినది, విరిగినది, పల్చనిపొర, గరుకైన ముక్కు, రంధ్రాలు పూజకు పనికిరావు. ఈ శంఖాలు వున్న ఇంటిలో అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రసిద్ధి. ఈ శంఖాలు కన్యాకుమారి, రామేశ్వరాలో దొరుకుతాయని ప్రసిద్ధి.
2. ముత్యాల శంఖం : ముత్యపు కనతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అత్యంత అరుదుగా దొరికేవే. ఈ శంఖాన్ని బుధవారం రోజు
ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై
ధనదాన్య సంరుద్ధిం దేహిదేహి నమః
ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తూ పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి.
3. ఏకాక్షి నారికేళం : మామూలు కొబ్బరికాయలకు రెండు కళ్ళు వుంటాయి. కానీ అరుదుగా దొరికే ఈ ఏకాక్షి (ఒంటికన్ను) నారికేళానికి ఒకే కన్ను వుంటుంది. ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ వేసి వాటిపై అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఉంచి, ఎర్రని వస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి, ధనలాభం చేకూరుతుంది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading