Varaha Swamy Utsava Murthy blessed devotees after 37 years

Varaha Swamy Utsava Murthy blessed devotees after 37 years… The processional deity of Sri Varaha Swamy was taken on a celestial procession around the four mada streets on Saturday, 27 April 2019.

This religious event took place as a part of the successful completion of Maha Sampai kshanam of Sri Varaha Swamy temple.

The deity was last taken on procession in 1982 when Maha Samprokshanan was carried out almost 37years ago. The devotees were deeply immersed in devotion and converged in huge numbers to witness the procession.

EO Sri Anil Kumar Singhal, JEO Tirumala Sri KS Sreenivasa Raju, DyEO Sri Harindranath, chief priest Sri Venugopala Deekshitulu, Agama advisors sri Mohana Rangacharyulu, Sri Anantasayana Deekshitulu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

37 ఏళ్ల తర్వాత శ్రీ వరాహస్వామి ఉత్సవమూర్తి భక్తులకు దర్శనం

ఏప్రిల్ 27, తిరుమ‌ల‌, 2019: తిరుమ‌ల‌లో శ్రీ వరాహస్వామి ఉత్సవమూర్తి శనివారం రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ పూర్తయిన సందర్భంగా ఈ ఊరేగింపు జ‌రిగింది.

ఈ ఆలయంలో గతంలో 1982వ సంవత్సరంలో మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీ వరాహస్వామి ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. తిరిగి 37 ఏళ్ల తరువాత స్వామివారు ఊరేగింపుగా రావడంతో పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు, డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు శ్రీ మోహనరంగాచార్యులు, శ్రీ అనంతశయన దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Write Your Comment