Tondamanadu Temple Pavitrotsavams 2026 | Tondamanpuram Venkateshwara Swamy Temple…. The Pavithrotsavams of Sri Venkateswara Swamy, along with His consorts Sri Devi and Bhu Devi, will be celebrated grandly at Tondaman Puram temple from August 26 to 28, 2026.
The festivities will begin with Ankurarpanam on August 25 at 6 pm as per Agama traditions.
On August 26, Pavitra Pratishta will be performed in the morning, followed by Vedic rituals at the Yagashala in the evening. On August 27, Pavitra Samarpana will be performed in the morning and Chatushtanarchana in the evening.
On August 28, the celebrations will conclude with Maha Poornahuti, Pavitra Vitarana, Snapana Tirumanjanam and Chakrasnanam in the morning. A Gramotsavam will be held in the evening.
As part of the celebrations, devotional music programmes will be organised by the TTD Hindu Dharma Prachara Parishad.
TTD appeals to devotees to participate in the festivities and seek the blessings of Sri Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 26 నుండి 28వ తేదీ వరకు వైభవంగా తొండమాన్ పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
తొండమాన్ పురంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 26 నుండి 28వ తేదీ వరకు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఆగస్టు 25న సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణంతో పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 26న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 27న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన చేపడతారు.
ఆగస్టు 28న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహించడంతో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ముగుస్తాయి. అనంతరం సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.
ఈ పవిత్రోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.