Tiruvadi Sannidhi Utsavam at Tirupati Govindaraja Swamy Temple

TTD is organising the Tiruvadi Sannidhi fete on the last Sunday of holy Karthika Masam at Sri Govindaraja Swami temple on December 10, 2023.

Among others the program begins with Tirumanjanam at Sri Anjaneya Swami temple in the morning.   Sri Govindaraja Swami and His consorts parade in the evening along the mada streets.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబ‌రు 10న‌ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం

తిరుప‌తి, 2023 డిసెంబ‌రు 07: తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో కార్తీక మాసంలో చివ‌రి ఆదివార‌మైన డిసెంబ‌రు 10న తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 గంట‌ల‌కు ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారి మూల‌వ‌ర్ల‌కు తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 2 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ఉభ‌య‌నాంచారుల‌తో క‌లిసి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆంజ‌నేయ‌స్వామివారి స‌న్నిధికి వేంచేపు చేసి ఏకాంతంగా తిరుమంజ‌నం చేప‌డ‌తారు. అక్క‌డ ఆస్థానం అనంత‌రం ఉభ‌య‌నాంచారుల‌తో కూడిన‌ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆల‌య మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యానికి తీసుకెళ‌తారు. దీంతో తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం ముగుస్తుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading