Tirupati TTD Temples to get ready for Vaikuntha Ekadashi

Extensive arrangements for the convenience of devotees has been made by TTD in local temples in view of Vaikuntha Ekadashi. 

All the temples are being decorated with special queues, sheds and Rangolis and decorated beautifully with different types of flowers. 

10 tons of traditional flowers and 1 lakh cut flowers will be used for flower decorations in local temples of Tirupati including Sri Govindarajavari Temple, Tiruchanoor,  Srinivasa Mangapuram, at Sri Prasanna Venkateswara Swamy Temple in Appalayagunta, in Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam.

Similarly Sri Kodandarama Swamy Temple in Tirupati, Sri Kodanda Ramalayam in Chandragiri, Sri Venugopalaswamy Temple in Karvetinagaram, Sri Padmavati sametha Venkateswara Swamy Temple in Pithapuram, Keelapatla Sri Konetiraya Swamy Temple also geared up for Vaikunta Ekadashi.

Sri Venkateswara Swamy temples in Bangalore, Hyderabad, Visakhapatnam and Amaravati are also geared up for Vaikunta Ekadasi on December 30.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

వైకుంఠ ఏకాదశికి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబు

డిసెంబ‌రు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేట్టారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించ‌నున్నారు. తిరుపతి స్థానిక ఆలయాల్లో పుష్పాలంకరణలకు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్ ఉపయోగించనున్నారు. 

 శ్రీ గోవింద‌రాజ‌వారి ఆలయంలో

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా  స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా వేకువజామున 12.05 నుండి 1.35 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం  నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 8.45 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.  ఉద‌యం 9 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.  

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తెల్ల‌వారుజామున 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాలు జ‌రుగ‌నున్నాయి. ఉద‌యం 3 గంట‌ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

శ్రీనివాసమంగాపురంలో …

డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 1.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం  నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

అదేవిధంగా డిసెంబ‌రు 31న  వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం  తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం  నిర్వహిస్తారు. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

అప్పలాయగుంటలో ….

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.

డిసెంబ‌రు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు  స్నపన తిరుమంజనం,  చక్రస్నానం నిర్వహించనున్నారు.

నారాయణవనంలో …

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు.

డిసెంబ‌రు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6 నుండి 7 గంటల గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 8:15 నుండి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగునుంది. 

అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading