Sri Govindarajaswamy Temple Festivals in March 2026… Following are the details of the several special festivals scheduled in the Sri Govindaraja Swamy Temple during March, 2026. They are..
The following special festivals and events are scheduled to be observed during the month of March at the Sri Govindaraja Swamy Temple, Tirupati:
On March 3, the temple will remain closed in view of the Lunar Eclipse.
On March 5, on the occasion of Uttara Nakshatram, Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi will bless devotees with a procession along the four Mada Streets.
On March 6, 13 and 20 (Fridays), Sri Andal Ammavaru will be taken in procession along the Mada Streets at 6:00 PM.
On March 15, on the occasion of Sravanam Nakshatram, Sri Kalyana Venkateswara Swamy along with Sridevi and Bhudevi will be taken in procession along the four Mada Streets at 6:00 PM.
On March 16, Koil Alwar Thirumanjanam will be performed in the temple in connection with Ugadi.
On March 19, Ugadi Asthanam will be held in the temple.
On March 24, on the occasion of Rohini Nakshatram, Sri Parthasarathy Swamy along with Rukmini and Satyabhama will bless devotees with a procession along the four Mada Streets at 6:00 PM.
The annual Panguni Uttaram Festival will be observed from March 26 to April 1.
Sri Rama Navami will be celebrated on March 27.
– మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ గోవింద రాజస్వామి ఆలయం మూత.
– మార్చి 5న ఉత్తరా నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు.
– మార్చి 6, 13, 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆలయ మాడవీధుల్లో శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
– మార్చి 15న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
– మార్చి 16న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
– మార్చి 19న ఆలయంలో ఉగాది ఆస్థానం.
– మార్చి 24న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిస్తారు.
– మార్చి 26 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు పంగుణి ఉత్తర ఉత్సవం.
– మార్చి 27న శ్రీరామ నవమి.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.