Tirupati Kodandaramaswamy Temple Festivals in June 2019

The following are the list of events to be observed in Sri Kodanda Rama Swamy temple in Tirupati in June 2019.

Sri Kodandaramaswami Temple is one of the famous temples in Tirumala Tirupati. It is dedicated to Lord Sri Ramachandra Swamy.

This temple, which was built by a Chola king during the tenth century AD, is situated in the heart of the Tirupati town. The presiding deities are Sita, Rama and Lakshmana.

Here is the list of Festivals at SKT in June 2019

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూన్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– జూన్ 1, 8, 15, 22, 29వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. రూ.116/- టికెట్ కొనుగోలు చేసి ఊంజ‌ల్‌సేవ‌లో పాల్గొన‌వ‌చ్చు.

– జూన్ 3న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

– జూన్ 6న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద‌కు ఊరేగింపుగా తీసుకెళ‌తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఊంజ‌ల్‌సేవ నిర్వ‌హిస్తారు.

– జూన్ 17న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఆస్థానం చేప‌డ‌తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment