TTD plans to conduct prestigious Srinivasa Kalyanam in 13 locations in Telangana and at Dharmapuri in Tamilnadu in the month of June 2019.
The TTD Srinivasa Kalyanam Project is conducting Srinivasa Kalyanam event to benefit the devotees who could not come to Tirumala to witness the daily ritual performed at the Srivari temple.
June 2, 2019: At Sangamitra marriage hall of Nedumaran nagar of Dharmapuri District in TamilNadu.
IN KARIMNAGAR DIST OF TELANGANA
June 3, 2019: Anjanadri temple in bharat nagar
June 4, 2019: Sri Ramalayam in Basant Nagar in Peddapalle mandal
June 5, 2019: At Junior College grounds in Vemulawada mandal HQ
June 6, 2019: Market yard of Dharmaram mandal
June 7, 2019: High school grounds of Chppadandi mandal
IN MAHBOOBNAGAR DIST
June 9, 2019: At Ramlila grounds of Housing Board colony in Mahboobnagar town.
June 10, 2019: Mandal parishad school premises of Nerellavari village in Timmajipeta mandal.
June 11, 2019: At Sri Ramalayam Of Nagal Kaidmur village in Narwa mandal.
June 12, 2019: At Junior college grounds of Martha Mandal HQ.
June 13, 2019: At Sri Ramalayam Of Chenneveli village in Baranagar mandal.
June 14, 2019: Old Ganji area of Shadnagar town.
Sri K Prabhakar Rao, Special Officer Of Srinivasa Kalyanam Project is supervising all arrangements for the holy event.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూన్‌లో 13 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి, 2019 మే 30: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్ నెలలో 13 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
– జూన్ 2వ తేదీన తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా కేంద్రంలోని నెడుమారన్ నగర్‌లో గల శ్రీ సంఘమిత్ర మ్యారేజ్ హాల్లో శ్రీవారి కల్యాణం జరుగనుంది.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో…
– జూన్ 3న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో గల శ్రీ అంజనాద్రి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
– జూన్ 4న పెద్దపల్లి మండల కేంద్రంలోని బసంతనగర్‌లో గల శ్రీ రామాలయ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
– జూన్ 5న వేములవాడ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– జూన్ 6న ధర్మారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
– జూన్ 7న చొప్పదండి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో…
– జూన్ 9న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల రామ్‌లీలా మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
– జూన్ 10న తిమ్మాజిపేట మండలం నేరెళ్లవారిపల్లి గ్రామంలో గల మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
– జూన్ 11న నార్వ మండలం, నాగల్ కడ్మూరు గ్రామంలో గల శ్రీ రామాలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.
– జూన్ 12న మక్తల్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
– జూన్ 13న బాలానగర్ మండలం చెన్నవేలి గ్రామంలో గల శ్రీ రామాలయం పరిసరాల్లో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
– జూన్ 14న షాద్‌నగర్ మండలం పాత గుంజిలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.ప్రభాకరరావు ఈ కల్యాణాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.