Patrapushpa Yagam at Kapileswara Swamy Temple, Tirupati

The Patra Pushpa Yagam festival will be grandly conducted at Sri Kapileswara Swamy Temple in Tirupati on May 1, 2026. On the previous evening, April 30 at 6 PM, the Ankurarpana ritual will be performed.

On May 1, from 7 AM to 9 AM, Snapan Tirumanjanam, Maha Poornahuti, and Kalashabhishekam will be performed for the festival deities of Sri Kapileswara Swamy and Sri Kamakshi Ammavaru. During this, sacred substances such as milk, curd, honey, Panchamritam, sugarcane juice, coconut water, vibhuti, turmeric, and sandalwood will be used for the abhishekam.

From 10 AM to 12 noon, the Patra Pushpa Yagam will take place. In this ritual, flowers such as chrysanthemum, oleander, mogali, champak, jasmine, rose, lotus, jasmine, and kanakambaram, along with sacred leaves like bilva, tulasi, and paneer leaves, will be offered to the deities.

In the evening, from 6 PM to 8 PM, the Tiruveedhi Utsavam of Sri Chandrasekhara Swamy and Manmohini Ammavaru will delight devotees.

Temple priests stated that the Patra Pushpa Yagam is performed not only for universal welfare but also to atone for any lapses committed by priests, attendants, officials, and devotees in the temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

మే 1 శ్రీ కపిలేశ్వరాలయంలో పత్ర పుష్పయాగం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మే 1వ తేదీన పత్ర పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు ముందురోజు ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది.

మే 1న ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, మహా పూర్ణాహుతి, కలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, పంచామృతం, చెరకు రసం, కొబ్బరి నీరు, విభూతి, పసుపు, చందనం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారు.

ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం జరుగనుంది. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, కనకాంబరం వంటి పుష్పాలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్పయాగం నిర్వహించనున్నారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశేఖర స్వామి, మన్మోహిని అమ్మవార్ల తిరువీధి ఉత్సవం భక్తులను అలరించనుంది.

లోకక్షేమం కోసమే కాకుండా ఆలయంలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల జరిగిన లోపాల నివారణార్థం పత్ర పుష్పయాగాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading