Aadi Krithika in Tirupati Kapileswara Swamy Temple

The Aadi Krithika festival will be celebrated with religious fervour at Sri Kapileswara Swamy Temple, Tirupati, on August 7, 2026.

On the occasion, Snapana Tirumanjanam will be performed to the processional deities of Sri Subrahmanya Swamy along with Sri Valli and Sri Devasena from 9.30 am to 10.30 am with milk, curd, honey, sandalwood and other fragrant ingredients.

Later, the Thiruveedhi Utsavam will be held from 6 pm to 8 pm. TTD has appealed to devotees to participate in large numbers and seek the divine blessings of the Lord.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

ఆగస్టు 7 శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా ఆడికృత్తిక ఉత్సవం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 7వ తేదీన ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి విశేష ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి విశేష పూజలు నిర్వహిస్తారు.

అనంతరం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి తిరువీధి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ అధికారులు కోరారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading