Panguni Uthiram 2019 in TTD Temples

The unique five festival of Phanguni Uttara Festival will be celebrated in the TTD local temples of Sri Kalyana Venkateswara Swamy, Narayana vanam and Sri Govindaraja Swamy Temple, Tirupati from March 15, Friday, and special events are slated for March 21, the concluding day.

As part of the festivities, daily ekantha Thirumanjanam will be performed to the deities both the Goddess Padmavathi of Narayana vanam and Sri Pundarikavalli of Govindaraja Swamy Temple. Later in the evening Prakara utsavam, utsava seva and Asthana will be performed for both the Ammavari idols.

Temple legends and Archakas say that Panguni Uttara festival is performed annually after the day of Ekantham of both Ammavaru with Srivaru.

The artists of the TTD Annamacharya project will present cultural and devotional programs like bhajans, Bhakti sangeet and kolatas on the evening of all days.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 15 నుండి 21వ తేదీ వ‌ర‌కు టిటిడి అనుబంధ ఆలయాలలో పంగుణి ఉత్తర ఉత్సవం

తిరుపతి, 2019 మార్చి 14: టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాల్లో మార్చి 15 నుండి 21వ తేదీ వ‌రకు పంగుణి ఉత్తర ఉత్సవం ఘనంగా జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా మార్చి 21న ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా నారాయణవనంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని, తిరుపతిలోని శ్రీపుండరీకవళ్లి అమ్మవార్లను ప్రతిరోజూ సుప్రభాతంతో మేల్కొలిపి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు అమ్మవారి ప్రాకార ఉత్సవం, ఊంజల్‌సేవ, ఆస్థానం చేప‌డ‌తారు. అమ్మవారితో శ్రీవారు ఏకాంతంగా గడిపిన రోజును పురస్కరించుకుని పంగుణి ఉత్తర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading