Nitya Pooja Vidhanam in Telugu (Daily Puja)

Nitya Pooja Vidhanam in Telugu is given here. Nitya Puja means the general Daily Puja which is performed by household everyday.

నిత్య పూజావిధానం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

(వినాయకుని / యిష్టదైవమును ధ్యానించవలెను).

(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)

శ్లో : అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచి:
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః

(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)

ఓం గురుభ్యో నమః

దీపమును వెలిగించి గంధ పుష్పాదులతో అలంకరించి దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.

దీప శ్లోకం : ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ

ఆచమన కేశవ నామములు

1. ఓం కేశవాయ స్వాహా (అనుచు జలపానము చేయవలెను)
2. ఓం నారాయణాయ స్వాహా (అనుచు జలపానము చేయవలెను)
3. ఓం మాధవాయ స్వాహా (అనుచు జలపానము చేయవలెను)
4. ఓం గోవిందాయ నమః (అనుచు ఎడమ చేతిని కుడి అరచేతితోను)
5. ఓం విష్ణవే నమః (అనుచు ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)
6. ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
7. ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
8. ఓం వామనాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
9. ఓం శ్రీధరాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
10. ఓం హ్రుషికేశాయ నమః (అనుచు ఎడమ అరచేతిపైనను )
11. ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండు పదముల పైనను)
12. ఓం దామోదరాయ నమః (అనుచు శిరము పైన నీరు చల్లుకొనవలెను)
13. ఓం సంకర్షణాయ నమః (అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను)
14. ఓం వాసుదేవాయ నమః (అనుచు ఎడమ ముక్కును)
15. ఓం ప్రద్యుమ్నాయ నమః (అనుచు కుడి ముక్కును అంగుష్ఠ (బొటనవేలు) తర్జనులతో (చూపుడు వేలు) తాకవలెను)
16. ఓం అనిరుద్ధాయ నమః (అనుచు ఎడమ కన్నును)
17. ఓం పురుషోత్తమాయ నమః (అనుచు ఎడమ చేతిని )
18. ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమ చేతిని)
19. ఓం నారసింహాయ నమః (కుడి చేతిని అంగుష్ఠ (బొటనవేలు) అనామికలతో (ఉంగరం వేలు) తాకవలెను
20. ఓం అచ్యుతాయ నమః (అనుచు నాభిని అంగుష్ఠ కనిష్టికలతో (బొటన చిటికెన వేళ్ళతో) తాకవలెను)
21. ఓం జనార్ధనాయ నమః (అనుచు అరచేతిని హృదయమునకు ఆనించాలి)
22. ఓం ఉపేంద్రాయ నమః (అనుచు శిరమును కరాగ్రముతో తాకవలెను)
23. ఓం హరయే నమః (అనుచు బాహు మూలములను వేళ్ళను ముడుచుకొని తాకవలెను)
24. ఓం శ్రీకృష్ణాయ నమః.

భూతోచ్చాటనము

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

1. శ్లోకము చదివి పూజాస్థలమున జలమును అక్షతలను చల్లవలెను. తరువాత కూర్చుని అక్షతలు కొన్ని వాసన చూసి వెనుకకు వేసుకోవాలి.

అథ ప్రాణాయామః

(కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి )

ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం జనః, ఓం తపః ,
ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధీయోయనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం
(మూడు సార్లు జపించవలెను)

అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను.

సంకల్పము

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే శ్రీ మహా విష్ణు రాజ్ఞీయ ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతా వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే రమణక వర్షే అయింద్ర ఖండే శ్రీసైలస్య పశ్చిమే పార్శ్వే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన …….. (శ్రీ నందన (సంవత్సరం పేరు)) నామ సంవత్సరే (ఆయనం పేరు చేర్చి) ….. ఆయనే (దక్షిణాయనే) , (ఋతువు పేరు చేర్చి) ….. ఋతే (శరత్) , ….. మాసే (కార్తీక ), …. పక్షే (శుక్ల) , …. శుభ తిథౌ …..శ్రీమాన్ (గోత్రము పేరు చెప్పి) గోత్రః (తన పేరు చెప్పుకొని) నామధేయః శ్రీమతః (గోత్రము పేరు చేర్చి) గోత్రస్య (తన పేరు చేర్చుకొని) నామ ధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐస్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం , మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ (మనం ఏ దైవమును పూజిస్తున్నామో అ దైవము పేరు చెప్పుకోవాలి కార్తిక మాసం దామోదర ఈశ్వర తులసి) శ్రీ ………….. దేవతా పూజాం కరిష్యే సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపాచారైః సంభవితా నియమేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే /

అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.
కలశ పూజ:
కలశం అంటే నీళ్ళు వుండే పాత్ర కు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అరా చేతితో కింద పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని

తదంగ కలశ పూజాం కరిష్యే //
శ్లో : కలశస్య ముఖే విష్ణుః కంఠ్ ఎ రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః //
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః //
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ //
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు శ్రీదేవి (దేవుని పేరు చేర్చి) పూజార్థం దురితక్షయ కారకాః (కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ)
పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య //

శ్రీ మహా గణాధిపతి పూజా

అదౌ నిర్విఘ్నేన పరిసమాప్యార్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచం ద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పక ర్ణాయ నమః
ఓం హేరంభాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం గణాధిపతయే నమః
షోడశ నామ పూజా సమర్పయామి
శ్లో : వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా //
గణాధిపతి సుప్రీతో వరదో భవతు
మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు //

ప్రతి ఉపచారమునకు ముందు మనం పూజిస్తున్న దైవమును ఓం శ్రీ ……………….. దేవతాయై నమఃఅని నమస్కరించుకుంటూ ఆయా ఉపచారములను జరపాలి.

1. ఆ దైవము ధ్యాన శ్లోకమును స్మరించుకుని

ఓం శ్రీ ………………….దేవతాయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి . (ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను )

2. ఓం శ్రీ ……………… దేవతాయై నమః ఆవాహయామి (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)

3. ఓం శ్రీ ………………. దేవతాయై నమః రత్న సింహాసనం సమర్పయామి ( కొన్ని అక్షతలు సమర్పించవలెను)

4. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి ( పుష్పం తో నీరు దేవుడి/దేవి కి పాదములు కడగాలి కడిగినట్టు భావించాలి )

5. ఓం శ్రీ ………………..దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవికి చేతులు కడగాలి కడిగినట్టు భావించాలి ).

6. ఓం శ్రీ …………………. దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవి కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).

7. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి (పుష్పం తో నీరు దేవుడి / దేవికి మధుపర్క స్నానానికి సమర్పించాలి)

8. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడి. దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి.

9. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి).

10. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ చేయాలి).

11. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం రూపేణ అక్షతాన్ సమర్పయామి(అక్షతలు వేయాలి).

12. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః శ్రీ గంధాం ధారయామి – (గంధం సమర్పించాలి).

13. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః సర్వాభరణాన్ ధారయామి (అక్షతలు సమర్పించాలి).

14. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పువ్వులు/ అక్షతలు సమర్పించాలి).

15. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని
చదువుకొన వలెను.

16. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి).

17. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః దీపం దర్శయామి (దీపం చూపించాలి).

18. ఓం శ్రీ ……………….. దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ
ఓం భూర్భువస్సువః తథ్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయా త్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పము తో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (క్లోక్ వైస్ ) తిప్పాలి.
అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి)
అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.
దిగువ మంత్రము లతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో ) చూపవలెను.
ఓం ప్రాణాయ స్వాహాఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా
ఓం పరబ్రహ్మణే నమః అంటూ నివేదించవలెను.

ఓం శ్రీ ……………….. దేవతాయై నమః తాంబూలం సమర్పయామి తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).

ఓం శ్రీ ……………….. దేవతాయై నమః కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీ ……………….. దేవతాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).

ఓం శ్రీ ……………….. దేవతాయై నమః నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను
శ్లో : యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతు ప్రదక్షిణం పదే పదే
పాపాహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవా
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత వత్సలా
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా //

ఓం శ్రీ ……………….. దేవతాయై నమః గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి ,
అశ్వా నారోహమావహయామి, గజనారోహమావాహయామి ,
ఓం శ్రీ ……………….. దేవతాయై నమః సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్ , దేవ్యోపచారాన్ సమర్పయామి.

(అంటూ అక్షతలు సమర్పించవలెను).

అనయా , యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ శ్రీ …………………………. దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు —-
ఓం శ్రీ ……………….. దేవతాయై నమః (మనం యథా శక్తి చేసిన పూజలకు భగవంతుడు ప్రీతి చెంది మన కోరికలను తీర్చి, మనలను కాపాడాలని కోరుకుంటూ )

కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారయణా యేతి సమర్పయామి

యే తత్ ఫలం శ్రీ ………………. దేవతార్పణ మస్తు

హరిః ఓం తత్సత్

Write Your Comment