Kshaura Karma | Hair Cutting | Shaving (Telugu)

Kshaura Karma (Hair Cutting / Shaving) in Telugu explains about the best days, Nakshatras, Yogas and the results of Kshaura Karma on those particular timings are explained here in Telugu….

క్షౌర కర్మ

క్షౌర కర్మను గురించి శాస్త్రము ఒక క్రమ పద్దతిని నిర్దిష్టించినది .

(a) శ్మశ్రూణ్యగ్రే వాపయతే అథోపకక్షావథ కేశానాథ లోమాన్యథ నాఖాని | .

(b) అథైతన్మనుర్వప్త్రే మిథునమపశ్యత్ |
స శ్మశ్రూణ్యగ్రే అవపత్ |
అథోపకక్షౌ అథకేశాన్.

తాత్పర్యము:

ముందుగా గడ్డమును కుడి ప్రక్కనుండి ప్రారంభించి పూర్తి చేయవలెను . పిమ్మట మీసములను , కక్షము (చంకలు) , పిదప తల వెంట్రుకలను కత్తిరించ వలయును చివరగా గోళ్ళను కత్తిరించుకొనవలెనని విధానము చెప్పబడినది .

తూర్పు కాని ఉత్తర ముఖముగా కూర్చొని చేయించుకోవలెను

క్షౌరకర్మ చేయించుకోకూడని సమయాలు : (తిథులు)

1) పాడ్యమి

2) షష్టి

3) అష్టమి

4) నవమి (శుక్ల పక్షము )

5) ఏకాదశి

6) చతుర్దశి

7) పౌర్ణమి

8) అమావాస్య

9) జన్మ నక్షత్రం ఉన్న రోజు

10) సూర్య సంక్రమణం నాడు

11) వ్యతీపాతం

12) విష్టి (భద్ర )

(రోజులు – సమయములు ) – చెయ్యకూడనివి

1) శనివారము

2) ఆదివారము

3) మంగళవారము

4) శ్రాద్ధ దినము నాడు

5) ప్రయాణము చేయబోయే రోజు

6) అభ్యంగన స్నానము చేసిన తరువాత

7) భోజనము చేసిన తరువాత

8) సంధ్యా సమయాల్లో ( 5 – 7 am ; 11-13 hrs ; 17 – 19 hrs)

9) రాత్రి పూట

10) మంగళ కార్యాలు (వ్రతాలు లాంటివి ) చేయదలచిన దినము

11) మంగళ కరమైన కట్టుబొట్టు ఆభరణాలు అలంకారములు చేసుకున్న పిదప ..

12) యుద్దారంభామున

13) వైధృతి యందు

పైన చెప్పిన రోజులు, సమయాల్లో క్షౌరకర్మ కూడదు

1) ఆదివారము క్షౌరము చేయించుకుంటే – 1 మాసము ఆయుక్షీణము

2) శనివారము క్షౌరము చేయించుకుంటే – 7 మాసాలు ఆయుక్షీణము

3) మంగళవారము క్షౌరము చేయించుకుంటే – 8 మాసాలు ఆయుక్షీణము

ఆయా దినములకు చెందిన అభిమాన దేవతలు ఆయు క్షీణింపచేయుదురు .

ఇదే విధముగా …

1) బుధవారము క్షౌరము చేయించుకుంటే – 5 మాసాలు ఆయువృద్ధి

2) సోమవారము క్షౌరము చేయించుకుంటే – 7 మాసాలు ఆయువృద్ధి

3) గురువారము క్షౌరము చేయించుకుంటే – 10 మాసాలు ఆయువృద్ధి

4) శుక్రవారము క్షౌరము చేయించుకుంటే – 11 మాసాలు ఆయువృద్ధి

ఆయా దినములయోక్క అభిమాన దేవతలు ఆయు వృద్ధి చేయుదురు .

కొడుకు పుట్టుక కోసం ఆశిస్తున్న వారు , ఒకే ఒక్క కొడుకు ఉన్నవారు సోమవారము క్షౌరము చేయించుకోకూడదు .

అలాగే విద్య , ఐశ్వర్యం కోరుకొనే వారు గురువారము క్షౌరము చేయించుకోకూడదు.

***క్షౌరకర్మ సమయంబున విష్ణు నామస్మరణచే సమస్త దోషములు తొలగును ****

అని ఈవిధముగా క్షౌరకర్మను గూర్చి *గర్గాది* మహర్షులు *వారాహి సంహిత* యందు వచించినారు .

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading