Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Himayatnagar Venkateswara Swamy Temple Brahmotsavams 2019 (Hyderabad)

TTD plans to conduct the annual brahmotsavams at the Sri Venkateswara temple located at Balaji Bhavan at Himayatnagar in Hyderabad from June 9-13 with Ankurarpanam on June 8th and Dhwajarohanam on June 9 at 8.30 am.

The schedule of events during Brahmotsavams includes Sesha vahanam on June 9, Hanumanta vahanam on June 10, Gaja vahanam and Garuda vahanamon June 11, Rathotsavam on June12 morning and Aswa vahanam at night, Chakra snanam June 13 and Pushpa yagam at evening followed by Dhwajavarohanam at night.

The Vedic pundits will perform snapana thirumanjanam on June 10.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూన్ 9 నుండి 13వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2019 మే 31: హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో గల బాలాజీ భవన్‌లో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 9 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వ‌హించ‌నుంది.

ఈ ఉత్సవాలకు జూన్ 8వ తేదీ సాయంత్రం అంకురార్పణ జ‌రుగ‌నుంది. జూన్ 9న‌ ఉదయం 8.30 గంట‌ల‌కు ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అదేరోజు రాత్రి శేష వాహనంపై స్వామివారు విహరిస్తారు. అలాగే జూన్ 10న ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, రాత్రి హనుమంత వాహనసేవ జరుగనుంది. జూన్ 11న ఉదయం గజవాహనం, రాత్రి గరుడసేవ నిర్వ‌హిస్తారు. జూన్ 12న ఉదయం 7.30 గంట‌ల‌కు రథోత్సవం, రాత్రి అశ్వవాహనసేవ జరుగనున్నాయి. జూన్ 13న‌ ఉదయం 10 గంట‌ల‌కు చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, రాత్రి ధ్వజావరోహణం వైభవంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment