Deepavali at Tirumala Tirupati Temple

On the auspicious day of Deepavali,  Asthanam will be held in Tirumala temple on 20 October 2025 from 7 am to 9 am.

As part of the Asthanam, Sri Malayappa Swamy along with the Sridevi and Bhudevi will be offered prayers on the Sarvabhoopala Vahanam facing the Garudalwar.  

Sri Vishvaksena, the commander-in-chief, is also enshrined on another pedestal to the left of the Sri Malayappa facing South.

After that, special puja, harati and prasadams are offered to the deities by the priests with which Deepavali Asthanam concludes.

At 5pm, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi will participate in Sahasra Deepalankarana Seva and walk around the four mada streets majestically to bless the devotees.

TTD has cancelled the Kalyanotsavam, Unjal Seva and Arjitha Brahmotsavam on October 20 owing to Deepavali Asthanam.   

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అక్టోబరు 20 శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుమల, 2025 అక్టోబర్ 07: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 20 తేదీన‌ దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది.

దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారుసేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారుఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజహారతిప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారుదీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

కాగా సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొనిఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా అక్టోబరు 20న క‌ల్యాణోత్స‌వంఊంజ‌ల్ సేవ‌ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసిందితోమాలఅర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading