Dashamahavidya Stotram in Telugu

Here are the lyrics of Dashamahavidya Stotram in Telugu..

దశమహావిద్యా స్తోత్రం

ఆదిశక్తి త్వమసి కాళీ, ముండమాలా ధారిణీ!

త్వమసి తారా ముండహారా, వికటసంకట హారిణీ!!

త్రిపురసుందర్యాదికాత్వం, షోడశీ పరమేశ్వరీ!

సకల మంగళ మూర్తి రసి, జగదంబికే భువనేశ్వరీ!!

త్వమసి మాతః ఖడ్గహస్తా, ఛిన్నమస్తా భగవతీ!

త్వమసి త్రిపురా భైరవీ, మాతస్త్వమసి ధూమావతీ!!

మాతరసి బగళాముఖీ త్వం, దుష్టబుద్ధివినాశినీ!

త్వమసి మాతంగి, త్వమసి కమలాత్మికాంబుజ వాసినీ!!

దశమహావిద్యా స్వరూపా, సకలభువిబహుసిద్ధిదా!

మూర్తిభేదా, దేవభేదో వస్తుతో నహి తే భిదా!!

భేదభావం బుద్ధితో మమ, దూరమపనయ సత్వరం,

ప్రేమ దేహి పదాంబుజే స్వేనావరం యాచేవరం!!

దశమహావిద్యల దేవతలు భావార్థ వివరణము:

౧. కాళీ ౨. తారా ౩. త్రిపురసుందరి(షోడశి) ౪. భువనేశ్వరి ౫. ఛిన్నమస్తా ౬. త్రిపురభైరవి ౭. ధూమావతి ౮. బగళాముఖీ ౯. మాతంగి ౧౦. కమలాత్మిక

మూర్తిభేదము, దేవతా భేదము కనిపించినా వస్తుతః తత్త్వమునందు భేదములేదు. అంతయు ఆద్యాశక్తి స్వరూపమే. భేదభావముతో కూడిన మన బుద్ధిని సత్వరము భేదభావమును తొలగించి దేవి పదాంబుజములందు ప్రేమను కలిగించునట్లు వరమును యాచించుదుము.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading