Akhanda Balakanda Parayanam in Tirumala on 1 April 2023

Akhanda Balakanda Parayanam in Tirumala… The 15th Edition of Akhanda Balakanda Parayanam will be observed in Nada Neerajanam Platform at Tirumala on April 1.

The 15 edition of Akhanda Balakanda Parayanam will be organised on Nada Neerajanam platform in Tirumala on April 1.

About 89 shlokas from chapters 71 to 73 will be recited on the occasion by Vedic scholars and students with the participation of devotees.

SVBC is telecasting live for the sake of global devotees between 7am and 9am.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 1న 15వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 26 మార్చి 2023: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఏప్రిల్ 1న శనివారం 15వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

బాలకాండలోని 71 నుండి 73వ సర్గల వ‌ర‌కు గ‌ల 89 శ్లోకాలను పారాయణం చేస్తారు. అదేవిధంగా యోగవాశిస్టం, ధన్వంతరి మహామంత్రం కలిపి 25 శ్లోకాల పారాయణం జరుగుతుంది. మొత్తం 114 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading