Avatara Mahotsavam at Sundararaja Swamy Temple – June 2019 | Tiruchanoor

The Avatara Mahotsavam at Sundararaja Swamy Temple, a sub-temple in the complex of Sri Padmavathi Ammavari temple, Tiruchanoor from June 23-25, 2019.

On all the three days, after daily rituals, Special Abhisekam will be grandly performed in Krishna Swami Mukha mandapam to utsava idols of Sri Sundararaja and his consorts in the afternoon and later on unjal seva in the evening.

On June 23 evening Sri Sundararaja swami will bless devotees on Pedda Sesha vahanam on the temple mada streets. On June 24 he will ride on Hanumanta vahanam.

On June 26 he will adorn the. Grand Garuda vahanam. In view of the 3 day holy festival TTD has cancelled the Sahasra Deepalankara seva on
all three days at the Goddess Padmavathi temple.

LEGEND

According to Puranic legend when invaders tried to demolish the Perumal Alagiri temple at Madurai, archakas brought the holy idols of Sri Sundararaja to Sri Padmavathi temple Tiruchanoor.

During 1902 period of the Mahants, utsava idols of Sri Sundararaja were installed .The period of shatabisha nakshatra of jyesta masam and till the passing of Uttarabadra star, marks the bringing of Idols from Madurai and it is celebrated as Avatara Mahotsavam by the TTD.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూన్ 23 నుండి 25వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

తిరుపతి, 2019 జూన్ 03: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు జూన్ 23 నుండి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం శ్రీ సుందరరాజస్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చ‌న నిర్వహిస్తారు.

జూన్ 23, 24, 25వ తేదీలలో మధ్యాహ్నం 2.00 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపములో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ జరుగుతుంది.

జూన్ 23వ తేదీ రాత్రి 7.00 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీసుందరరాజస్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

జూన్ 24వ తేదీ రాత్రి 7.00 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీసుందరరాజస్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.

జూన్ 25వ తేదీ రాత్రి 7.00 గంటల నుండి 8.30 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా జూన్ 23 నుండి 25వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సహస్రదీపాలంకరణసేవను రద్దు చేశారు.

సంక్షిప్త సమాచారం :

శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు(ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహిస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment