Annamacharya Jayanthi Utsavams begins

The week long Jayanthi Utsavams of Saint Poet Sri Tallapaka Annamacharya commenced on a grand note in Tirupati and also in Tallapaka of Kadapa distritct under the aegis of Annamacharya Project of TTD on Saturday.

In Tallapaka village, the home turf of the saint poet, the 611th Birth Anniversary was observed in a big way by organising celestial marriage of the deities in Dhyana Mandiram followed by special cultural programmes at 108 feet statue of Annamacharya.

While in Tirupati devotional songs penned by Annamacharya were rendered by project artistes in a melodious manner and in the evening the Mridangam concert by renowned artist Dr Ella Venkateswara Rao in Mahati Auditorium in Tirupati enthralled the music lovers.

TTD has mulled week long literary, music programmes on the occasion of Birth Anniversary of Sri Tallapaka Annamacharya which will conclude on May 24.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతి, 2019 మే 18 ;కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి తత్త్వాన్ని లోకానికి చాటిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 611వ జయంతి ఉత్సవాలు శ‌నివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఉదయం సుమారు 50 మంది అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహించారు. ఆ త‌రువాత తిరుప‌తికి చెందిన శ్రీ పి.రాజేష్ కుమార్‌, శ్రీ‌మ‌తి జి.ఆశాదీపిక బృందం గాత్ర సంగీత కార్య‌క్ర‌మం జ‌రిగింది. అదేవిధంగా, శ్రీ కె.చంద్ర‌శేఖ‌ర్ బృందం అన్నమయ్య జీవిత చరిత్రపై హరికథ పారాయణం చేశారు.

సాయంత్రం 6 గంట‌లకు హైద‌రాబాద్‌కు చెందిన కుమారి బి.మ‌ధులిక బృందం సంగీత క‌చేరి, రాత్రి 7.30 గంట‌లకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి పి.శైల‌జ బృందం నృత్య కార్య‌క్ర‌మం జ‌రుగ‌నున్నాయి.

మహతి కళాక్షేత్రంలో :

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల‌కు హైద‌రాబాద్‌కు చెందిన ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత డా.. ఎల్లా వేంక‌టేశ్వ‌ర‌రావు మృదంగ వాద్య సంగీత కార్యక్రమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య బి. విశ్వ‌నాథం, ఏఈవో శ్రీ‌మ‌తి విఆర్‌.శాంతి, రీసెర్చి అసిస్టెంట్‌ డా|| సి.లత ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తాళ్లపాకలో వైభవంగా శ్రీవారి కల్యాణం

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 611వ జయంతిని పురస్కరించుకుని వారి జన్మస్థలమైన కడప జిల్లా తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద శ‌నివారం ఉదయం శ్రీవారి కల్యాణం కన్నులపండుగ‌గా జ‌రిగింది.

తాళ్లపాకలో ఉదయం 10.00 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యాహవచనం, పవిత్రహోమం, కంకణధారణ, మాంగళ్యధారణ, మంగళాశాసనం ఘట్టాలతో సంప్రదాయబద్ధంగా శ్రీవారి కల్యాణం జరిగింది. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. అనంతరం అన్నమయ్య వంశీకులను అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య బి. విశ్వ‌నాథం సన్మానించారు. అన్నమయ్య జయంతి సందర్భంగా టిటిడి భక్తులకు మంచినీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదాలు అందించింది. పెద్దసంఖ్యలో భక్తులు క‌ల్యాణంలో పాల్గొన్నారు.

అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు నాదస్వర సమ్మేళనం, ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ కె.సుబ్ర‌మ‌ణ్యం, శ్రీ పి.గోవింద‌య్య బృందం గాత్రం, క‌ర్నూలుకు చెందిన శ్రీ టి.సాయిరాం బృందం హరికథ గానం చేయనున్నారు.

రాజంపేట-కడప హైవేలోని తాళ్లపాక వద్ద ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద శ‌నివారం సాయంత్రం 6.30 నుండి 8.00 గంటల వరకు శ్రీవారి ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం నిర్వహిస్తారు. రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు మ‌ద‌న‌ప‌ల్లికి చెందిన శ్రీ‌మ‌తి టిఎం.నాగ‌మ‌ణి బృందం హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య బి. విశ్వ‌నాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading