పాదరస విగ్రహాల పూజ ఇతర విగ్రహాల పూజల కంటే 1000 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి.జాతకచక్రంలో బుధ,రాహు గ్రహా దోషాలు ఉన్నవారు పాదరస దుర్గాదేవిని పూజించిన ఉపశమనం కలుగుతుంది.కాలసర్పదోషం(రాహు కేతువుల మద్య గ్రహాలు) ఉన్నవారు,నాగదోషం (పంచమంలో రాహు గ్రహం) ఉన్నవారు,జాతక చక్రంలో రాహు దశలు జరుగుతున్నప్పుడు పాదరస దుర్గాదేవిని పూజించాలి.
జన్మరాశిలో గాని,జన్మ లగ్న జాతకంలో గాని రాహు గ్రహం శత్రు క్షేత్రాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేనప్పుడు వారి శారీరక,మానసిక ప్రవర్తన సరిగా ఉండదు.మానసికమైన చికాకులు,ఆందోళనలు,తొందరపాటు నిర్ణయాలు,అపోహలు,చెడు వ్యసనాలకు బానిసలు అవుతారు .అలాంటి వారు రాహు కాలంలో రాహుకాల దీపాలు పాదరస దుర్గాదేవి విగ్రహం ముందు వెలిగించి దుర్గా సప్తశ్లోకి చదివితే రాహు గ్రహం నుండి వచ్చే ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చును.
పాదరస దుర్గాదేవి విగ్రహాన్ని పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రం పరిచి దానిపైన పాదరస దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్టింపచేయాలి.ఎరుపు రంగు పూలతో దుర్గాదేవి విగ్రహాన్ని అలంకరించాలి.
పాదరస దుర్గాదేవిని రాగి,ఇత్తడి,వెండి,బంగారం ప్లేట్లపై ప్రతిష్టించేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని ఆ ప్లేట్లపై తప్పనిసరిగా ఉంచాలి.
నేతి దీపంతో దీపారాధన చేస్తే చాలా మంచిది.అగరబత్తీతో దూపం చూపించాలి.పాదరస దుర్గాదేవి విగ్రహానికి “దుర్గాసప్తశ్లోకి ” చదువుతూ కుంకుమార్చన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.
“ఓం హ్రీం దుర్గే పారదేశ్వరీ సర్వార్ధ సిద్ధం” అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించాలి.
పాదరస దుర్గాదేవిని పూజించిన వారికి దురదృష్టకర ప్రమాదాల బారినుండి రక్షింపబడతారు.
శత్రుభాధల నుండి విముక్తి కలుగుతుంది.
చెడుకలలు రాకుండా ఉంటాయి.మోసం,భ్రమ,అత్యాశ,దుఃఖము మొదలగు వాటివలన కలుగు ఇబ్బందులను తొలగిస్తుంది.
చెడుదృష్టి,దీర్ఘకాల అనారోగ్యం,రాహుగ్రహా భాధల నుండి విముక్తి కలుగుతుంది.
ఇంటిలో నైరుతి దిక్కు దోషాలు ఉన్నవారు పాదరస దుర్గాదేవిని పూజించిన ఆ దిక్కు దోషాల వలన కలుగు ఇబ్బందులు తొలుగుతాయి.
పాదరస దుర్గాదేవిని పూజించిన రుణభాదలు తొలిగి ధనాభివృద్ధి కలుగుతుంది.పాదరస దుర్గాదేవిని వ్యాపారస్ధలంలో ఉంచి పూజించిన వ్యాపారాభివృద్ధి,ధనాభివృద్ధి,గౌరవాలు లభిస్తాయి.