ఒకసారి పార్వతీదేవి శివుడితో!

ఒకసారి పార్వతీదేవి శివుడితో! స్వామి ఇంద్రుడికి గృహం ఉంది, దేవతలకి గృహాలు ఉన్నాయి. కాని మనకి మాత్రం లేదు. కట్టించండి అని అడిగింది. అప్పుడు శివుడు! వద్దు పార్వతి. మనకి ఇల్లు అచ్చుబాటు లేదు. ఆలోచన మానుకో అన్నాడు. కాని పార్వతి కాదు కుదరదు అనేసరికి. సరే అని అమరాశిల్పిని పిలిపించి అత్యద్భుతమైన ఇల్లు ఒకటి కట్టమని ఆజ్ఞాపించాడు. అమరశిల్పి తక్షకకోటిని పిలిపించి బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. గృహప్రవేశానికి అందరికి ఆహ్వానం పంపించారు. ఎవరికి ఏ వరం కావాలో కోరుకొండి అడిగిన తక్షణమే ఇచ్చేస్తా అన్నాడు. ఆ ఆహ్వానం రావణాసురుడికి కూడా వెళ్ళింది. గృహప్రవేశానికి అందరు వచ్చి వరాలు అడిగి తీసుకుంటున్నారు. రావణుడు వంతు వచ్చింది. రావణుడు! శివ ఏవరం వాలన్నా లేదనకుండా ఇస్తాను అని మాట ఇచ్చావ్ కనుక అడిగింది కాదనకూడదు అన్నాడు. సరే ఏమి కావాలో అడగమంటే ఈ ఇల్లు నచ్చింది. ఇచ్చేసేయి అనేసరికి శివుడు పార్వతి ఆశ్చర్యపోయి ఏమిచేయలేక ఇస్తున్నా తీసుకో అని ఇచ్చేశాడు. అక్కడికి ఒక ఇల్లు ఇచ్చేశారు. ఇంకోన్నిరోజుల తరువాత మళ్లి అడిగింది. మళ్లి దేవశిల్పిని పిలిపించి మల్లి కట్టించాడు. ఈ సారి రావణుడిని పిలవలేదు. ఐతే గృహప్రవేశానికి ”శని” వచ్చాడు.

ఆయన్ని చూడగానే అగ్నిహోత్రుడు గజగజ వొణికిపోయాడు. నన్ను ఏమి చేస్తాడో శని అనుకుని భయంతో ప్రజ్వలించి ఆ ఇంటిని కల్చేశాడు. అలా రెండో ఇల్లుకూడా పోయింది. పార్వతీ మనకి ఇల్లు అచ్చుబాటు లేదు, ఒద్దు అని చెప్పాను కదా! ఇంకా ఇంటిమీద ఆశలు వదిలిపెట్టు అనగానే చేశేది లేక సరే అని ఊరుకుంది. ఆ విధంగా శివుడికి ఇల్లు లేకుండా పోయింది

Write Your Comment