Special religious events are scheduled to take place at the Sri Kodandarama Swamy Temple in Tirupati in May 2026.
On May 1 and 31 (Poornima), Ashtottara Shatakalasabhishekam will be performed at 9:30 AM. In the evening at 5:30 PM, Sri Kodandarama Swamy along with Sita and Lakshmana will take a procession in the four Mada streets.
On May 2, 9, 16, 23, and 30 (Saturdays), Abhishekam to the main deities will be performed at 6:00 AM. In the evening at 5:00 PM, the utsava deities will be taken in a procession followed by Unjal Seva in the temple.
On May 8, Asthanam of Sri Kodandarama Swamy will be held at 8:00 AM at Annamacharya Kalamandiram.
Hanuman Jayanti will be observed on May 12.
On May 16 (Amavasya), Sahasra Kalasabhishekam will be performed at 8:30 AM. Hanumantha Vahana Seva will be held at 7:00 PM.
On May 21 (Punarvasu Nakshatram), Sri Sita Rama Kalyanam will be conducted at 11:00 AM.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే నెలలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
– మే 1, 31వ తేదీలలో పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి దర్శనం ఇవ్వనున్నారు.
– మే 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ జరుగనుంది.
– మే 8న అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 8 గంటలకు శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం.
– మే 12న హనుమజయంతి.
– మే 16న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
– మే 21వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.