Sri Subramanya Swamy Homam began on 24 October 2025 morning at Sri Kapileswara Swamy Temple in Tirupati as part of the ongoing month-long Kartika Masa rituals.
The Subramanya Swamy Homam will be conducted for three days from October 24 to 26, 2025.
On October 27, the Dakshinamurthy Swamy Homam will be performed, followed by the Divya Kalyanotsavam of Sri Subramanya Swamy with Sri Valli and Sri Devasena at 5.30 PM.
Temple Deputy EO Smt. Nagarathna, Superintendent Sri Chandrasekhar, temple priests, other staff, devotees participated in the event.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ రోజు నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు సుబ్రమణ్యస్వామి వారి హోమం జరుగనుంది.
ఇందులో భాగంగా యాగశాలలో శుక్రవారం ఉదయం పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు.
కాగా ఈ నెల 27వ తేదీ శ్రీ దక్షిణ మూర్తి స్వామి వారి హోమం జరుగనుంది. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.