Punganur Kalyana Venkateshwara Swamy Temple Brahmotsavams 2026

The annual Brahmotsavams will be held from February 24 to March 4, 2026 at Sri Kalyana Venkateshwara Swamy Temple in Punganur, Annamaya district.

On this occasion, the Ankurarpanam will be held on February 23 between 7 pm and 8.30 pm.

Vahana Sevas will be conducted every day during Brahmotsavam from 8 am to 11 am and again from 7 pm to 9 pm.

24 February 2026

Morning – Dhwajarohanam (9.50 am to 10.45 am in Mesha Lagnam)

Night – Peddashesa Vahanam

25 February 2026

Morning – Chinnashesa Vahanam

Night – Hamsa Vahanam

26 February 2026

Morning – Simha Vahanam

Night – Mutyapupandiri Vahanam

27 February 2026

Morning – Kalpavriksha Vahanam

Night – Hanumantha Vahanam

28 February 2026

Morning – Mohini Utsavam

Night – Garuda  Vahana

1 March 2026

Morning – Suryaprabha Vahana

Night – Chandraprabha Vahana

2 March 2026

Morning – Kalyanotsavam (11 am to 1 pm)

Night – Gaja Vahana

3 March 2026

On the occasion of lunar eclipse, the temple will be closed from 09.00 am to 07.00 pm

Aswa Vahanam from 8.30 pm onwards

4 March 2026

Morning – Rathotsavam (9 am to 9 pm)

Afternoon – 12.45 pm to 2pm Chakra Snanam

Night – Dhwaja Avarohanam

5 March 2026

Tiruppavada Seva will be held at 10 am and the Sayanotsavam at 7.30 pm.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 24 నుండి మార్చి 4  వరకు పుంగనూరు శ్రీ క‌ల్యాణ వెంక‌ట‌ర‌మ‌ణ స్వామివారి బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య జిల్లా పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ వెంక‌ట‌ర‌మ‌ణ స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 04వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 7 గం.ల నుండి 8.30 గం.ల మధ్య అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా ఆల‌య ప‌రిస‌రాల‌లో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్‌, పుష్పాలంకరణలు చేపట్టారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

24 February 2026

ఉద‌యం – ధ్వజారోహణం (ఉదయం 9.50 గం.ల నుండి 10.45 గం.ల వరకు మేష ల‌గ్నంలో)

రాత్రి – పెద్ద‌శేష‌వాహనం

25 February 2026

ఉద‌యం – చిన్న‌శేష‌వాహనం

రాత్రి – హంస వాహనం

26 February 2026

ఉద‌యం – సింహ వాహనం

రాత్రి – ముత్య‌పుపందిరి వాహనం

27 February 2026

ఉద‌యం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం

రాత్రి – హ‌నుమంత వాహనం

28 February 2026

ఉద‌యం – మోహినీ ఉత్స‌వం

రాత్రి – గ‌రుడ వాహ‌నం

1 March 2026

ఉద‌యం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం

రాత్రి – చంద్ర‌ప్ర‌భ‌వాహనం

2 March 2026

ఉద‌యం – క‌ల్యాణోత్స‌వం (ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు)

రాత్రి – గ‌జ వాహ‌నం

3 March 2026

చంద్రగ్రహణం సందర్భంగా ఉద‌యం 09.00 గం.ల నుండి రాత్రి 07.00 గం.ల వరకు ఆలయం మూత,

రాత్రి 8.30 గం.ల నుండి అశ్వ వాహనం

4 March 2026

ఉదయం – రథోత్సవం (ఉద‌యం 9 గం.లకు )

మధ్యాహ్నం – 12.45 గం.ల నుండి 02.00 గం.ల వరకు మిధున లగ్నంలో చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం.

5 March 2026

ఉద‌యం 10 గంట‌ల‌కు తిరుప్పావ‌డ సేవ‌, రాత్రి 7.30 గంట‌ల‌కు శ‌య‌నోత్స‌వం జరుగనుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading