Vimana Jeernoddharana Ashtabandhana Mahasamprokshna will be held at Nagalapuram Vedanarayana Swamy Temple, Sri Vedavalli Sametha, on 17 February 2026.
As part of this, Acharya Ritwik Varanam, Punyaham, Mritasanghranan and Ankurarpanam will be held on February 17 at 5.30 pm.
On February 18, Asta Bandhana Samarpana will be held in the morning, Punyaham, Panchagni Pratishtha, Kumbha Vahanam, Aradhana, Homam, Poornahuti will be held in the evening, Pancha Gavyadhivasam and Nava Kalasha Snapanam will be held on February 19.
On February 20, Ksheerabdhivasam will be held in the morning, Vedic programs will be held in the Yagasala in the evening, Jaladhivasam will be held in the morning, and Maha Shanti Tirumanjanam will be held in the evening.
On February 22, Vimana Rajagopura Samprokshanam will be held from 11 am to 12 noon, and Maha Samprokshanam of the Moola Virat will be held from 11:30 am to 12:30 pm. Later, devotees will be allowed to have darshan of the main deity.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఫిబ్రవరి 17 నుండి 22వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ
నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 22వ తేదీ వరకు విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ జరుగనుంది.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 17న సాయంత్రం 5.30 గంటలకు ఆచార్య ఋత్విక్ వరణం, పుణ్యహం మృత్సంగ్రహణం, అంకురార్పణం జరుగునుంది.
ఫిబ్రవరి 18న ఉదయం అష్ట బంధన సమర్పణ, సాయంత్రం పుణ్యాహం, పంచాగ్ని ప్రతిష్ఠ, కుంభ వాహనం, ఆరాధన, హోమం, పూర్ణాహుతి, ఫిబ్రవరి 19న పంచ గవ్యాధివాసం, నవ కలశ స్నపనం నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 20న ఉదయం క్షీరాబ్ధివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఫిబ్రవరి 21న ఉదయం జలాధివాసం, సాయంత్రం మహా శాంతి తిరుమంజనం జరగనుంది.
ఫిబ్రవరి 22న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గర్భాలయ మూలవర్ల మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.