The outside temples under the umbrella of TTD gears up for the Vaikuntha Ekadashi and Dwadashi festivities on December 30 and 31, 2025 respectively.
The ancient Soumyanatha Swamy temple at Nandalur, Sri Prasanna Venkateswara Swamy at Avulapalle in Somala Mandal of Chittoor, and also similar one at Borragmanda in Sadum Mandal of Chittoor, Sri Konetiraya Swamy temple of Keelapatla special festivities will be performed on these two days.
Other temples includes Sri Kalyana Venkateswara Swamy temple in Punganur, Sri Prasanna Anjaneya Swamy and Sri Lakshmi Narasimha Swamy temple in Chowdepalle, Sri Prasanna Venkateswara Swamy temple in Mangalampeta, Sri Padmavathi sameta Sri Venkateswara Swamy temple in Peethapuram of Kakinada special arrangements will be made for V day.
Similarly the Sri Venkateswara temples in Bengaluru, Hyderabad, Visakhapatnam, Amaravathi also observe special festivities on the upcoming V day.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
December 30న వైకుంఠ ఏకాదశికి టిటిడి స్థానిక ఆలయాలలో విస్తృత ఏర్పాట్లు
December 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు.
నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయంలో…
అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలోని శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయంలో December 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం, ఉదయం 8.30 గంటలకు లక్ష తులసీ అర్చన నిర్వహించనున్నారు.
December 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.45 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. జనవరి 13న గోదా కల్యాణం, జనవరి 15న పార్వేట ఉత్సవం జరుగనుంది.
ఆవులపల్లి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…
చిత్తూరు జిల్లా సోమల (మం)లోని ఆవులపల్లి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో December 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3 నుండి 3.30 గంటల వరకు తిరుప్పావై జరుగనుంది. అనంతరం ఉదయం 5 నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 7 నుండి 10.30 గంటల వరకు స్వామి అమ్మవార్లు తిరుచ్చిపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
బొర్రగమంద …
చిత్తూరు జిల్లా సదుం ( మం)బొర్రగమంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో December 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3 నుండి 3.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5 నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 7 నుండి 10.30 గంటల వరకు స్వామి అమ్మవార్లు తిరుచ్చిపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
December 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామోత్సవం జరుగనుంది.
పుంగనూరులో ….
పుంగనూరులోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 12.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. తెల్లవారు జామున 2 నుండి రాత్రి 10.30 గంటల వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.
రాజనాల బండలో …
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లి గ్రామంలోని రాజనాలబండ శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
మంగళంపేటలో ….
చిత్తూరు జిల్లా పులిచెర్ల (మం) మంగళం పేటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో December 30న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, చిత్తూరు జిల్లా గంగవరం (మం) కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.