Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Swarna Rathotsavam in Tiruchanoor Vasanthotsavams celebrated

The celestial Swarna Rathotsavam was observed with utmost religious fervour on Saturday in Tiruchanoor temple (18 May 2019).

As a part of the annual vasanthotsavams, on second day morning, the processional deity of Sri Padmavathi was taken on a celestial ride on Swarna Ratham, the golden chariot along the four mada streets encircling the shrine.

The mammoth chariot was pulled by women devotees with religious ecstasy.

Speaking on the occasion, Tirupati JEO said, the three day annual vasanthotsavam is going on in a religious manner in Friday Gardens. He said, the Augmented Realty Technology (ART) will come in to existence in the next four days and the pilgrims have to down load Padmavathi Parinayam app in their mobiles to feel the unique experience of ART. He also said, from an average turn out of 15 thousands pilgrims per day a few years ago, now nearly 25-30 thousand pilgrims are thronging the Ammavari temple. To facilitate the pilgrims, we have developed waiting hall in the cellar of old annaprasadam complex, he maintained.

Later in the afternoon Snapana Tirumanjanam was performed to the utsva murthy of Ammavaru.

Tirupati JEO Sri B Lakshmikantham ,Temple DyEO Smt Jhansi Rani and other temple staffs were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి క‌టాక్షం

తిరుపతి, 2019 మే 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శ‌నివారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులను క‌టాక్షించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మండ‌పానికి తీసుకొచ్చారు. ఉదయం 7.11 నుండి 11 గంటల వ‌ర‌కు స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ వ‌సంత ఋతువులో అమ్మ‌వారిని కొలిస్తే స‌ర్వ‌రోగాలు దూర‌మ‌వుతాయ‌ని పురాణాల ద్వారా తెలుస్తోంద‌న్నారు. అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం స్న‌ప‌న తిరుమంజ‌నం, సాయంత్రం అమ్మ‌వారి ఊరేగింపు, ఇత‌ర సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని తెలియ‌జేశారు. శ‌నివారం ఉదయం సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగి భక్తులను కటాక్షించారన్నారు. వ‌సంతోత్స‌వాల కోసం శుక్ర‌వార‌పు తోట‌ను స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించిన‌ట్టు వివ‌రించారు. భ‌క్తులు వేచి ఉండేందుకు పాత అన్న‌దాన భ‌వ‌నంలో ఏర్పాటుచేస్తున్న సెల్లార్ ప‌నులు పూర్త‌య్యాయ‌ని, రెండు రోజుల్లో భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని తెలిపారు. ప‌ద్మావ‌తి ప‌రిణ‌యం పేరిట శుక్ర‌వార‌పు తోట‌లో ఏర్పాటుచేస్తున్న ఆగుమెంట్ రియాలిటి టెక్నాల‌జి ప‌నులు 4 రోజుల్లో పూర్త‌వుతాయ‌ని తెలిపారు. గూగుల్ నుండి ప‌ద్మావ‌తి ప‌రిణ‌యం పేరిట గ‌ల యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ ఫ్రేముల‌ను తిల‌కించ‌వ‌చ్చ‌న్నారు. ఇందులో శ్రీ ప‌ద్మావ‌తి జ‌న‌నం, బాల్యం, ప‌రిణ‌యం త‌దిత‌ర ఘ‌ట్టాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఇటీవ‌ల అమ్మ‌వారి ఆల‌యానికి భ‌క్తుల సంఖ్య పెరుగుతోంద‌ని, గ‌తంలో రోజుకు 15 వేల మంది వ‌స్తుండ‌గా, ప్ర‌స్తుతం 25 వేల నుండి 30 వేల మంది వ‌స్తున్నార‌ని వివ‌రించారు.

కాగా, మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అక్కడ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment