Pedda Sesha Vahana Seva, Govindaraja Swamy Brahmotsavams – 11 May 2019

The vahana sevas in Sri Govindaraja Swamy temple annual brahmotsavams commenced with Peddasesha Vahanam on Saturday, 11 May 2019.

The Lord Sri Govindarajaswamy flanked by Sridevi and Bhudevi on His either sides blessed devotees on Adi sesha-the 1000-hood serpent king which was depicted here in seven hoods in sitting posture.

The devotees were mused to see the Lord on the mighty serpent carrier on Saturday evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పెద్దశేష వాహనంపై గోవిందుడి వైభవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి 8 గంటల నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో శ్రీగోవిందరాజ స్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు ప్రబోధిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment