Margashira Lakshmi Vratha Katha in Telugu, Story of Margashira Thursday Lakshmi Puja

Here is the Margashira Lakshmi Vratha Katha in Telugu, the story of Margashira Thursday Lakshmi Puja. Margashira Lakshmi Vratham is observed on all Guruvar (Thursdays) in the month. In some areas, it is even continued till the first Thursday of Pushya Masam (Poush Month). Here goes the story….

Download Margashira Mahalakshmi Vratha Vidhanam in Telugu PDF

పూర్వ కాలమున ఒక పల్లెటూర్లో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగుపొరుగు వారు జాలి పడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి “ఓ అమ్మాయి! నీవు లక్ష్మి పూజ చేయుట ప్రారంభించుము. మీకు కష్టనష్టములు తొలగును” అని చెప్పగా ఆనాటి నుండి మట్టితో లక్ష్మి దేవి బొమ్మను తయారు చేసుకుని భక్తిప్రపత్తులతో చూసుకుంటుండేది. సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకు అప్పగించి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మి బొమ్మకు నైవేద్యం వుంచేది. కొన్నాళ్ళకు ఆ పిల్ల యుక్త వయస్కురాలై, పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తనతో పాటు, లక్ష్మి దేవి బొమ్మను కూడా తీసుకెళ్ళి పోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలి పోయింది. అత్తింట్లో నిత్యకళ్యాణం కాగా పుట్టింట్లో దరిద్రం దాపురించింది.

ఆ విషయం తెలిసిన ఆ అమ్మాయి వెంటనే తమ్మున్ని పిలిచి, ఒక చేతికర్ర నిండా వరహాలు నింపి అతని చేతికిచ్చి ఇంటికి చేరవేయమని చెప్పింది కాని ఆ కర్రను అతను మార్గమధ్యంలో పోగొట్టుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత తమ్ముడు మళ్ళీ వచ్చి “మనిల్లు ఎప్పటిలాగే దరిద్రం గానే ఉంది” అని చెప్పగా, అతనికి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి నాన్న కివ్వమని చెప్పింది. దాన్నికూడా అతను ఎక్కడో పోగొట్టుకుని ఇంటికి చేరాడు. మళ్ళీ ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి అమ్మకివ్వమని చెప్పింది. అది కూడా పోగొట్టుకున్న తమ్ముడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటికి చేరాడు. కొన్నాళ్ళ తర్వాత భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది ఆ అమ్మాయి.

తన సవతి తల్లితో “అమ్మ! ఈ రోజు లక్ష్మివారం కదా లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాం. నువ్వేమీ తినకుండా ఉండు” అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి, చంటి పిల్లలకు చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది. తన కూతురికి ఆ విషయం తెలియడంతో, “సరేలే, వచ్చేవారం నోచుకుందాం. ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు” అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మివారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ ఆ తల్లి, మిగిలిన నూనెను తలకు రాసుకుంది. “సరేలే, మూడోవారం నోచుకున్డువు గానీ అప్పుడైనా జాగ్రత్తగా ఉండు” అని చెప్పింది.

తల్లి మూడోవారం, నాలుగో వారం కూడా ఏదో రకంగా వ్రత నియమాలను ఉల్లంఘించడంతో,  చేసేదేమీలేక అసహనంతో “ఐదో లక్ష్మివారం అయినా నిష్టగా ఉండి పూజ చేయకపోతే మీ దరిద్రం ఇలాగే ఉంటుంది” అని కాస్త హెచ్చరించి, ఆ రోజు రాగానే తల్లి కొంగు తన కొంగుకు ముడి వేసుకుని, తల్లితోవ్రతం చేయించింది.

కూతురు పూర్ణం బూరెలు నివేదించ గానే మహాలక్ష్మి స్వీకరించింది. కాని తల్లి పెట్టినవి మాత్రం స్వీకరించలేదు. “అమ్మాయీ నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకొంటుంటే, నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు. అందువల్ల మీ అమ్మ నైవేద్యం తీసుకోలేదు” అని చెప్పగా, ఆ అమ్మాయి తన తల్లితో అమ్మవారికి క్షమాపణ చెప్పించగా అప్పుడు అమ్మవారు నైవేద్యం ఆరగించి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వర్దిల్లుతాయని వరమిచ్చి అంతర్ధానమైంది.

 

Write Your Comment

19 Comments

  1. ramya says:

    this is my first Margashira Lakshmi puja.and i got information through this. thank you very much.

  2. santoshi says:

    Thankq soo much madam with ur effort,
    i got the information and i did puja though im in states.

  3. Supriya says:

    Thankyou for this site, first day pooja completed, I read the story from yr site.

  4. Soumya says:

    Thanks for the details. Does anyone of you have the Kannada Version? It would be great if someone posts a Kannada Version of the Pooja Vidhanam.

  5. aparnaa says:

    the information is very apt and suitable,convenient addition of some strotras adn slokas will help us

  6. sujji says:

    at what time we should do in the morning or in the evening

  7. shailaja says:

    Uptill has anyone got the real peace, prosperity,Wealth ….. by doing this vrath like this. This must be something to do not only outer but in our own. Actually the vrath(leave) should be of all bad sanskars in us.
    The soul should be vicefree then only we get real fruit of the vrath.

  8. shailaja says:

    uptill has anyone got real peace, prosperity, wealth by doing this vrata,
    that means need to know the real meaning of vrata, it should not do only outer but vrata, fast of all vices. the soul should be vicefree then we get real fruit of the vrata.

  9. sravani says:

    thank you so much for story written script provided in your web

  10. Deepa says:

    Hai, thanks for all the information.can anyone translate the story in English as i can’t read Telugu.

  11. Vijaya ammajirao says:

    Thanks.We could read the Lakshmi vratam Katha in the puja.

  12. vpv says:

    thanks for uploading the katha, it is very useful…

  13. Telugu kahindi translation

  14. rani says:

    nalantivariki ento upayogamga untundi. thank you.

  15. LAKSHMI pidaparthi says:

    Good story never knew about it

  16. Lakshmi battina says:

    Chala bagundi thanks a lot

  17. m.santarao purohith says:

    Very fine this story

  18. Puneeth says:

    Can some old translate in english

  19. Bindu says:

    Is it compulsory that the naivedyam should be as per list given.

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading