Keelapatla Konetiraya Swamy Temple Brahmotsavam 2023

The annual brahmotsavams of Sri Konetiraya Swamy temple in Keelapatla will be observed between April 28 and May 6.

The important days includes Garuda Seva and Kalyanotsavam on May 2, Vasanthotsavam on May 3, Rathotsavam on May 5 and Chakra Snanam on May 6.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 28 నుండి మే 6వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 ఏప్రిల్ 17: చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 28 నుండి మే 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, ఏప్రిల్ 27న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి.

రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం

28-04-2023 ధ్వజారోహణం(కర్కాటక లగ్నం) శేష వాహనం

29-04-2023 తిరుచ్చిఉత్సవం హంస వాహనం

30-04-2023 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

01-05-2023 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

02-05-2023 మోహినీ ఉత్సవం కల్యాణోత్సవం, గరుడ వాహనం

03-05-2023 హనుమంత వాహనం వసంతోత్సవం గజ వాహనం

04-05-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

05-05-2023 రథోత్సవం అశ్వవాహనం

06-05-2023 చక్రస్నానం ధ్వజావరోహణం

ఉత్సవాల్లో భాగంగా మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది.

రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

మే 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading